Home రివ్యూస్ వీళ్లు ఎవరు చెబితే నమ్ముతారు..? / Pulwama attack

వీళ్లు ఎవరు చెబితే నమ్ముతారు..? / Pulwama attack

190
0

వీళ్లు ఎవరు చెబితే నమ్ముతారు..? ఇది దాదాపు అందరిలో తలెత్తుతున్న పెద్ద ప్రశ్న. ఫిబ్రవరి14న పుల్వామాలో జైషే మహ్మద్ సంస్థ జరిపించిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు. ఆ తరువాత 10 రోజులకు భారత వైమానిక దళాలు పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించాయి. మరుసటిరోజు పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ సమయంలో పాక్ యుద్ధ విమానాన్ని భారత భద్రతా దళాలు కూల్చివేశాయి. భారత పైలట్ అభినందన వర్ధమాన పాక్ సైనికులకు పట్టుబడడం.. మూడు రోజులకు విడిచి పెట్టడం జరిగింది. ఇక్కడ పుల్వామా దాడి తామే జరిపామని జైషే మహ్మద్ ప్రకటించింది. సర్జికల్ దాడులు నిర్వహించామని భారత రక్షణ దళాలు ప్రకటించాయి. సర్జికల్ దాడులు జరిగిన విషయం వాస్తవమేనని పాక్ ఒప్పుకుంది. ప్రతిగా వైమానిక దాడులకు దిగింది. ఉద్రిక్తత వద్దని ప్రపంచ దేశాలు ప్రకటన చేశాయి. భారత పైలట్ ను పాకిస్థాన్ విడిచి పెట్టింది. రోజూ రెండు దేశాల మధ్య పరస్పర దాడులు జరుతూనే ఉన్నాయి. ఇవన్నీ కళ్లకు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ దేశంలోని ప్రతిపక్షాలు సాక్షాలు కావాలంటున్నాయి. శవాలు ఏవీ కూలిన చెట్లు కన్పిస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నాయి. పైగా దీంట్లో ఎన్నికల కోణం ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కోసమే పుల్వామా దాడిని మోదీ జరిపించున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేయడం దానికి చంద్రబాబు సహా ఇతర పక్షాలు వంత పడుతున్నారు. ఇన్ని సాక్షాలు కళ్లెదురుగా కన్పిస్తున్నా వీళ్లు నమ్మడం లేదు. చివరకు వాయుసేనా అధిపతి బీఎస్ ధనువా సైతం సర్జికల్ దాడులు జరిపామని మీడియా ఎదుట వెల్లడించాల్సి వచ్చింది. ఇది నిజంగా బాధాకరం. దేశానికి రక్షణగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిత్యం సరిహద్దు ఆవలి శత్రువులతో పోరాడుతున్న భద్రతా బలగాలను అనుమనించడం వారి త్యాగాన్ని అవమానించినట్టె. ఇన్ని సజీవ సాక్షాలు కన్పిస్తున్నా.. ఒప్పుకుంటే క్రెడిట్ మోదీకి దక్కుతుంది. ఇప్పుడు వీళ్లకు సాక్షాధికారాలు కావాలి. ఎన్ని చూపించినా వీళ్ళు నమ్మరు. నమాలంటే పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పలేమో..?

వాయుసేనా అధిపతి బీఎస్ ధనువా ఏం చెప్పారంటే

ఎక్కడెక్కడ దాడి చేయాలనే లక్ష్యాలపైనే మా దృష్టి ఉంటుంద‌ని ధ‌నువా చెప్పారు. మా లక్ష్యం నెరవేరిందా? అనేదే చూస్తాము కానీ, దాడుల్లో ఎంతమంది చనిపోయారన్న‌ది మేము లెక్కించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. బాలాకోట్‌ శిబిరంపై దాడి చేశామ‌ని, ఈదాడిలో హతమైన ఉగ్రవాదులు ఎంత‌మంది అనేదీ ప్ర‌భుత్వమే చూసుకుంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మన దేశ‌ విమానాలకు శత్రువుతో పోరాడే సామర్థ్యం ఉంది అని ఆయ‌న తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here