Home breaking news వివాదంలో బిగ్‌బాస్‌-3 – ఫిర్యాదు చేసిన న‌టి గాయ‌త్రి గుప్తా

వివాదంలో బిగ్‌బాస్‌-3 – ఫిర్యాదు చేసిన న‌టి గాయ‌త్రి గుప్తా

238
0
Gayatri Gupta

హైద‌రాబాద్ః బిగ్‌బాస్‌-3 షో వివాదాల్లోకి కూరుకొని పోతోంది. ఈ షో ఆరంభంలో విప‌రీతంగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. రెండో షో నాటికి వివాదాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. మూడో షో నాటికి వివాదాలు మ‌రింత పెరిగిపోయాయి. బిగ్‌బాస్‌ నిర్వాహ‌కుల‌పై ఇటీవ‌లే యాంక‌ర్ శ్వేతారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. తాజాగా న‌టి.. గాయత్రి గుప్తా రాయ‌దుర్గం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌ -3 షోకు సంబంధించిన అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకొని.. ఇప్పుడు సెల‌క్ట్ కాలేద‌ని చెబుతున్నార‌ని.. ఈ కార‌ణంగా తాను ఆరు సినిమాల‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని ఫిర్యాదు సారంశం. త‌న‌కు జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం చెల్లించాల‌ని కూడా ఆమె డిమాండ్ చేశారు. ప‌నిలో ప‌నిగా మ‌రో విష‌యాన్ని కూడా ఆమె బ‌య‌ట‌పెట్టారు.

బిగ్‌బాస్‌-3 షో పాల్గొంటే.. పై వారిని ఎలా సంతృప్తి ప‌రుస్తార‌ని.. త‌న‌ను క‌లిసిన ర‌ఘు, ర‌వికాంత్ ప్ర‌శ్నించార‌ని గాయత్రి గుప్తా వెల్ల‌డించారు. ఈ విష‌యంపై తాను సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యాయ‌ని.. చెప్పారు. బిగ్‌బాస్ అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకున్న త‌రువాత 100 రోజులు అక్క‌డే ఉండాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి.. ఇత‌ర ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోవ‌ద్ద‌ని త‌న‌కు సూచించార‌ని తెలిపారు. ఈ కార‌ణంగా తాను ఆరు సినిమాల‌ను తిర‌స్క‌రించాన‌ని వెల్ల‌డించారు. ఇప్పుడు తాను బిగ్‌బాస్‌కు సెల‌క్ట్ కాలేద‌ని.. స‌మాచారం అందించార‌ని చెప్పారు. బిగ్‌బాస్ షో కార‌ణంగా తాను న‌ష్ట‌పోయాను కాబ‌ట్టి.. ప‌రిహారం చెల్లించాల‌న్న డిమాండ్ న్యాయ‌ముంది క‌దా. స‌రే ఇంత‌కీ ఆమె ఎందుకు సెల‌క్ట్ కాలేదంటే.. సంతృప్తి విష‌యంలో సంతృప్తిక‌ర స‌మాధానం రానందునే అన్న అనుమానాలు క‌లగ‌డంలో ఏ మాత్రం అనుమానం లేద‌న్న ప్రచారం మాత్రం జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here