Home తాజా వార్తలు విలన్ గా నన్ను భరించలేరు.. హీరో రాజశేఖర్

విలన్ గా నన్ను భరించలేరు.. హీరో రాజశేఖర్

95
0

విలన్ పాత్రలు చేయడానికి నేను రెడీ. కానీ ఆ పాత్రల్లో నన్ను భరించలేరని హీరో డాక్టర్ రాజశేఖర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే అన్ని విలన్ పాత్రలు చేయనని, ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి, శ్రీమంతుడు, అరవింద సమేత సినిమాల్లో జగపతిబాబు పోషించినటువంటి పాత్రలకు తాను సిద్ధమని చెప్పుకొచ్చారు.

ఆయన నటించిన కల్కి సినిమా విజవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా సహచరి జీవితతో కలిసి మీడియాతో మాట్లాడారు. కల్కి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమాను ఒక్కొక్కరు రెండుసార్లు చూస్తున్నామని మెసేజ్ లు పంపిస్తున్నారని ఆయన తెలిపారు. మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పిస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డైటింగ్ చేశానని, పొట్ట తగ్గించుకున్నానని చెప్పుకొచ్చారు. తన ఇద్దరు కూతుళ్ళతో త్వరలోనే ఒక సినిమా చేస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here