Home breaking news వాహ్ ఖాన్ సాబ్ క్యాబాత్ హై | Pak Pm Imrankhan

వాహ్ ఖాన్ సాబ్ క్యాబాత్ హై | Pak Pm Imrankhan

167
0

ఊహించ‌ని వ్య‌క్తి నుంచి ప్ర‌సంశలు వ‌స్తే.. ఊహించ‌ని వ్య‌క్తి నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తే మ‌న‌కు క‌లిగే భావ‌న మాట‌ల్లో చెప్ప‌లేం. ఇప్పుడు కూడా పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి, మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా స‌రిగ్గా అలాంటిదే. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తేనే శాంతి చ‌ర్చ‌లు జ‌రిగే అవకాశ‌ముంటుంద‌ని ఆయ‌న చెప్పారు. స‌హ‌జంగా ఈ ప్ర‌క‌ట‌న విన‌గానే.. ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. నిన్న‌గాక మొన్నే వైమానిక‌దాడులు చేశాము. మాట‌ల్లో తీవ్ర‌త చూపించుకున్నాం. ఏకంగా యుద్ధ వాతావ‌ర‌ణమే క‌న్పించింది. ఇప్పుడు హ‌ఠాత్తుగా ఈ స్టేట్‌మెంట్ ఏమిటీ..?

బీజేపీ గెలుపు అవ‌కాశాల‌ను దెబ్బ‌కొట్ట‌డానికే
ఈ ఎన్నిక‌ల్లో దేశ ర‌క్ష‌ణ అంశాన్నే బీజేపీ ప్ర‌ధానంగా ప్ర‌యోగిస్తోంది. ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌డానికి తాము చిత్త‌శుద్దిగా ప‌ని చేస్తున్నామ‌ని ప్ర‌క‌టిస్తోంది. దీనికి నిద‌ర్శ‌నంగా యూరి ఘ‌ట‌న త‌ర్వాత స‌ర్జిక‌ల్ స్టైక్‌, పుల్వామా దాడి త‌రువాత జ‌రిపిన వైమానిక‌దాడులను చూపిస్తోంది. పాక్ దాడికి పాల్ప‌డిన ఎఫ్ 16 విమానాన్ని కూల్చిన సాక్షాల‌ను చూపిస్తోంది. అ దే విధంగా కాంగ్రెస్ హ‌యాంలో ముంబాయిలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల్లో అనేక‌మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత మ‌న దేశం నుంచి ఎలాంటి ప్ర‌తిఘ‌ట‌న జ‌ర‌ప‌లేదు. అదే విధంగా కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగిన ఉగ్ర‌దాడుల వ‌ల్ల క‌లిగిన ప్రాణ న‌ష్టాన్ని కూడా ప్ర‌చారం చేస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో అటువంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌ని చెబుతోంది. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ మ‌న‌దే అని గంటాప‌థంగా చెబుతోంది. బాలాకోట్‌లో ఉగ్ర‌దాడులు జ‌రిపిన త‌ర్వాత ప్ర‌పంచ దేశాలు భార‌త్‌కు అనుకూలంగానే ప్ర‌క‌ట‌న‌లు చేశాయి. దీంతో ప్ర‌జ‌ల నుంచి సానుకూల‌త వస్తున్న‌ద‌ని బీజేపీ భావిస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీలు కూడా భావిస్తున్నాయి. బీజేపీకే గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో మొద‌టి ద‌శ పోలింగ్‌కు ముందురోజు బీజేపీ గెలిస్తేనే శాంతి చ‌ర్చ‌ల‌కు అవ‌కాశ‌ముంటుంద‌ని పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్ర‌క‌టించ‌డంపై విస్మ‌యం వ్య‌క్త‌మవుతోంది. ‘బీజేపీ మళ్లీ గెలిస్తే, కశ్మీర్‌ వివాదంపై ఒక పరిష్కారానికి అవకాశం ఉంటుంద‌ని చెప్పారు. బీజేపీ కాకుండా ఇతర పార్టీలు గెలిస్తే హిందుత్వ వాదుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో క‌శ్మీర్‌ వివాదం పరిష్కారానికి వెనుకంజవేస్తాయ‌ని వ్యాఖ్యానించారు. పైగా జైషే మొహమ్మద్‌ సహా దేశంలోని అన్ని ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాదులను నిరాయుధులుగా చేసి ఆయా సంస్థల యాజమాన్యంలో ఉన్న పాఠశాలలను స్వాధీనం చేసుకున్నామ‌ని ప్ర‌క‌టించారు. బీజేపీ దాని మాతృసంస్థ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ భార‌త్‌లో భాగ‌మ‌ని, దాన్ని స్వాధీనం చేసుకుంటేనే క‌శ్మీర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌లుగుతుంద‌ని చెబుతున్నాయి. అలాంటిది బీజేపీ గెలిస్తే స‌మ‌స్య ఎలా ప‌రిష్కార‌మ‌వుతుంది. త‌మ ఆధీనంలోని క‌శ్మీర్ భూభాగాన్ని పాక్ వ‌దులుకుంటుందా.? ఆ స‌మస్యే ఉండ‌దు. మ‌రి ఇమ్రాన్‌ఖాన్ బీజేపీ గెల‌వాల‌ని ఎందుకు ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు.. దీని వెనుక ఉన్న కార‌ణ‌మొక్క‌టే క‌న్పిస్తోంది. అదేంటంటే.. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా బీజేపీ గెలుపు అవ‌కాశాల‌ను దెబ్బ‌తీయాల‌న్న కోరికే క‌న్పిస్తోంది. ఇమ్రాన్ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే… కాంగ్రెస్ స‌హా ప్ర‌తిప‌క్షాల‌న్నీ స్పందించాయి. మోదీ, ఇమ్రాన్ ఒక్క‌టే అని వారిద్ద‌రు కుమ్మ‌క్క‌యార‌ని విమ‌ర్శ‌లు గుప్పించాయి.

బీజేపీకి ఓటు.. పాక్‌కు వేసినట్లే
బీజేపీ గెలిస్తే శాంతి చ‌ర్చ‌ల‌కు అవ‌కాశ‌ముంటుంద‌ని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ, ఇమ్రాన్‌తో కుమ్మక్కయ్యారని ఈ ప్ర‌క‌ట‌న‌తో స్పష్టమవుతోందని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. పాకిస్థాన్ అధికారికంగా మోదీతో జట్టుకట్టింద‌ని, మోదీకి ఓటేస్తే పాకిస్తాన్‌కు ఓటేసినట్టే అని ఆయ‌న త‌న‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అప్పట్లో నవాజ్‌ షరీఫ్‌తో సన్నిహితంగా ఉన్న మోదీ, తాజాగా ఇమ్రాన్‌ఖాన్‌ దగ్గరి స్నేహితుడయ్యారని వ్యాఖ్యానించారు. భారత ప్రధానిగా ఎవరుండాలని పాకిస్థాన్ కోరుకుంటోందో ఇమ్రాన్‌ వ్యాఖ్యలతో అర్థమైందని సీపీఎం ప్ర‌ధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ లేవ‌నెత్తిన‌ ప్రధానాంశం పాక్‌ ఒక్కటే అని, ఆ దేశాన్ని ప్రతిపక్షాలతో లింకు పెడుతూ మాట్లాడుతున్న విష‌యాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు, ప్రధానిగా మోదీ ఉండాలని ఇమ్రాన్ అంటున్నారు. ఆహ్వానించకున్నా పాక్‌ వెళ్లిన ఏకైక ప్రధాని, దేశ సైనిక స్థావరంలోకి పాకిస్థాన్ ఐఎస్‌ఐను ఆహ్వానించిన ఏకైక భారత ప్రధాని మోదీ ఒక్క‌రే అని ఏచూరి ఎద్దేవాచేశారు. ఈ ప్ర‌తిప‌క్షాల నేత‌ల స్పంద‌న‌ను చూసి బీజేపీ గెలుపు అవ‌కాశాల‌ను దెబ్బ‌కొట్ట‌డానికే ఇమ్రాన్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు చెప్ప‌వ‌చ్చు. స‌మ‌ర్దుడైన క్రికెట‌ర్ ఇమ్రాన్‌ఖాన్‌. అందివ‌చ్చిన బాల్‌ను క్రికెట‌ర్ బౌండ‌రీ దాటిస్తాడు. ఇప్ప‌డు భార‌త్‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఇమ్రాన్‌కు అందివ‌చ్చిన అవ‌కాశం.. దీన్ని అందిపుచ్చుకొని బీజేపీని బౌండ‌రీ దాటించాల‌ని చేసిన ప్ర‌య‌త్నంగా చూడ‌వ‌చ్చు.

Please Subscribe our Website And Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here