Home Entertainment వాళ్లిద్ద‌రు అంద‌మైన భామ‌లు‌‌ – సినిమాలో అక్కా చెల్లెళ్లు – స్వీట్​ టైటిల్

వాళ్లిద్ద‌రు అంద‌మైన భామ‌లు‌‌ – సినిమాలో అక్కా చెల్లెళ్లు – స్వీట్​ టైటిల్

262
0
వాళ్లిద్ద‌రు అక్కా చెల్లెళ్లు - మ‌ధుర‌మైన టైటిల్
సిమ్రాన్​, త్రిష

వాళ్లిద్దరు అంద‌మైన భామ‌లు. వాళ్లిద్ద‌రూ క‌లిసి ఒక సినిమాలో న‌టిస్తున్నారు. ఆ సినిమాకు మ‌దుర‌మైన పేరు నిర్ణ‌యించారులే. ఇంత‌కీ వాళ్లిద్ద‌రు ఎవ‌రంటే.. ఒక‌రు త్రిష‌, మ‌రొక‌రు సిమ్రాన్‌. వీళ్లిద్ద‌రూ క‌ల‌సి రెండు ద‌శాబ్దాల క్రితం అంటే 1999లో క‌లిసి న‌టించారు. ఆ చిత్రం పేరు జోడి. ఆ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్. ఆమెకు స్నేహితురాలిగా త్రిష కొద్దిసేపు క‌న్పిస్తారు. ఆ త‌రువాత సిమ్రాన్ పెళ్లి చేసుకొని ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. త్రిష మాత్రం స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

ఇప్పుడు సిమ్రాన్ మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించింది. గ‌తేడాది ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన పేట సినిమాలో వీళ్లిద్ద‌రు న‌టించారు. కాకుంటే ఇద్ద‌రూ క‌లిసి ఉన్న స‌న్నివేశాలు లేవు. తాజా సుమంత్ రాధాకృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వీళ్లిద్ద‌రు అక్కా చెల్లెళ్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు షుగ‌ర్ అన్న తీయ‌ని టైటిల్ నిర్ణ‌యించార‌ట‌. అయితే ఇది యాక్ష‌న్ సినిమా అని చెబుతున్నారు. ఇందులో అభిన‌య్ వ‌డ్డీ, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here