Home తాజా వార్తలు వాడు.. నా పిల్ల‌లు క‌లిసి న‌న్నుచంపేశారు- ఎన్టీఆర్‌ | Lakshmi’s NTR Movie Trailer ...

వాడు.. నా పిల్ల‌లు క‌లిసి న‌న్నుచంపేశారు- ఎన్టీఆర్‌ | Lakshmi’s NTR Movie Trailer review

574
5

వాడు.. నా పిల్ల‌లు క‌లిసి న‌న్ను చంపేశారు వంటి ప‌వ‌ర్‌పుల్ డైలాగ్‌తో లక్ష్మీస్ ఎన్టీఆర్ (అస‌లు క‌థ‌) ట్రైల‌ర్ ను రాంగోపాల్ వ‌ర్మ విడుద‌ల చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్‌లో ప‌వ‌ర్‌పుల్ డైలాగులు అనేకం చూపించారు.
ఆమె(ల‌క్ష్మీ పార్వ‌తి)కు అనేక మందితో సంబంధాలున్నాయి.
రామారావుగారు న‌న్ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పారు.
*శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి మహా మహా అందగత్తెలతో పరిచయం ఉన్న ఆయనకి దానిలో ఏముందనో.. * నా కొడుకు లోకేశ్ మీద ఓట్టు*
వంటి డైలాగులు ఈ ట్రైల‌ర్‌లో ఆర్‌జీవీ చూపించారు.

ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘ‌ట్టాల‌ను చూపిస్తూ రాంగోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ..పూర్తిగా వెన్నుపోటు సీను మాత్ర‌మే క‌న్పించ‌నుంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నేతృత్వంలో బాల‌క్రిష్ణ న‌టించిన రెండు సినిమాలు.. క‌థ‌నాయకుడు, మ‌హానాయ‌కుడు సినిమాల‌కు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కొన‌సాగింపుగానే అన్పించ‌నుంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్ర‌క‌టించిన ఆర్‌జీవీ రెండో ట్రైల‌ర్‌ను విడుద‌ల‌ చేశారు. ఈ సినిమా పూర్తిగా చంద్ర‌బాబు వ్య‌తిరేకంగా తీసిన‌ట్టు ఈ ట్రైల‌ర్ చూస్తే తెలిసి పోతుంది.

ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌రోతోనే ఈ ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతోంది.
వ‌రుస‌గా స‌న్నివేశాలు ఈ విధంగా ఉన్నాయి.
* నేను నేను కాదు.. నేను నా ప్రజలే నన్ను ఇంతటి వాడిని చేశారు. ఇప్పుడు వాళ్లే నన్ను వద్దనుకున్నారు. ఆ పవర్ ని వెనక్కి తీసేసుకున్నారు అంటూ ఎన్టీఆర్ మాటలు విన్పిస్తాయి.
* మీరు అనుకుంటున్నట్లు ఆవిడ అంత మంచి మనిషి కాదు. ఇంతకు ముందే ఆవిడకు చాలా మందితో ఎఫర్స్ ఉన్నాయి. అంటూ ఎన్టీఆర్‌తో చంద్రబాబు చెప్పే స‌న్నీవేశం వ‌స్తుంది.
* నేను నీతో ఒక ముఖ్య‌మైన విష‌యం చెప్పాలి ల‌క్ష్మీపార్వ‌తితో ఎన్టీఆర్‌
రామారావు గారు ఆయన్ని పెళ్లి చేసుకోమని అడిగారు. అంటూ లక్ష్మి పార్వతి త‌న భ‌ర్త‌తో అంటున్న స‌న్నివేశం.
ఎన్టీఆర్ పునర్వివాహం అంటూ పత్రికల్లో వార్తలు వస్తాయి.

శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి మహా మహా అందగత్తెలతో పరిచయం ఉన్న ఆయనకి దానిలో ఏముందనో ముండా*.. అని ఎన్టీఆర్ కుమార్తె చెంప దెబ్బ కొట్టే స‌న్నివేశం

మీరు కొట్టినా, పొడిచినా, చంపినా నేను వచ్చింది ఆయనకు సేవ చేసుకోవడానికే* అని లక్ష్మి పార్వతి చెబుతుంది.

పార్టీలో ఏ నిర్ణ‌యం తీసుకున్న నాకు తెలియ‌కుండా జ‌ర‌గ‌డానికి వీళ్లేదు.* ఎన్టీఆర్ అంటారు.

మ‌నం ఎందుకు ప‌నికిరాని ద‌ద్ద‌మ్మ‌ల‌మ‌ని అనుకుంటున్నారా..?* ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చంద్ర‌బాబుతో అంటున్న స‌న్నివేశం

ఆయ‌న‌కు ఏ హాని త‌ల‌పెట్ట‌న‌ని హామీ ఇవ్వండి.* చంద్ర‌బాబుతో ల‌క్ష్మీ పార్వ‌తి.

నా కొడుకు లోకేశ్ మీద ఒట్టేసీ చెబుతున్నా.* చంద్ర‌బాబు

దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నంలో మీ సపోర్ట్ 100 శాతం కావాలి.* ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని చంద్ర‌బాబు కోరుతాడు.

ఆ పార్టీలో ఎన్టీఆర్ లేనే లేరు. ఉన్న‌దంతా అదొక్క‌తె. ఎన్టీఆర్ ని కీలుబొమ్మని చేసి ఆడిస్తోంది. పార్టీ స‌ర్వ‌నాశ‌నం* అంటూ అంతా లక్ష్మి పార్వతిపై నిందలు వేస్తారు.

స‌మ‌స్సే లేదు. ఆ ఎనిమిది ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేయండి.* ఎన్టీఆర్ ఆగ్ర‌హం.

అబద్దానికి నోరు పెద్దది, అన్యాయానికి చేతులు పెద్దవి* ఎన్టీఆర్
వెన్నుపోటు పొడిచారు. అంటూ సాంగ్ ప్లే అవుతుంది.

దేనికైనా టైం రావాలి.* అన్న డైలాగ్‌కు * టైం రాదు. దాన్ని మ‌న‌మే తీసుకొని రావాలి.* అంటూ చంద్ర‌బాబు మాటలు. * మ‌న ద‌గ్గ‌ర నిజ‌ముంది. నిజాన్ని ఎవ‌రూ ఆప‌లేరు.* ఎన్టీఆర్ డైలాగ్‌తో ఈ ట్రైల‌ర్ ఎండ్ అవుతుంది.

5 COMMENTS

 1. Thank you a lot for sharing this with all of us you really recognise what you are talking about!
  Bookmarked. Please additionally discuss with my web site =).
  We can have a hyperlink exchange contract among us카지노

 2. After I originally commented I appear to have clicked the -Notify me when new comments are added-
  checkbox and from now on whenever a comment is added I receive 4 emails with the exact same comment.
  There has to be a way you are able to remove me from that service?
  Thanks!

 3. Simply want to say your article is as astounding.
  The clarity on your publish is simply great and i can assume
  you are an expert on this subject. Well together with your permission allow
  me to seize your RSS feed to stay updated with impending post.
  Thanks one million and please keep up the rewarding work.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here