Home breaking news lakshmi’s ntr movie | ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ కు స‌ర్టిఫికెట్ నిరాక‌ర‌ణ‌

lakshmi’s ntr movie | ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ కు స‌ర్టిఫికెట్ నిరాక‌ర‌ణ‌

94
0

మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంలోని *వెన్నుపోటు * ఘ‌ట్టాల‌తో సిద్ధ‌మైన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాకు సెన్సార్‌బోర్డు స‌ర్టిఫికెట్ నిరాక‌రించింది. ఈ విష‌యాన్ని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెలిపారు. తొలి దశ పోలింగ్‌ (11-04-2019) పూర్తయ్యే వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదంటూ సెన్సార్‌ బోర్డ్‌ తనకు లెటర్ ఇచ్చింద‌ని రామ్ తెలిపారు. ఈ పరిణామాలపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్టుగా వెల్లడించారు. సెన్సార్‌ బోర్డ్‌ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. ఈ సినిమాను మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావ‌డానికి వీలుగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు. https://twitter.com/RGVzoomin/status/1107176002277593093

అయితే ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం కుద‌ర‌దంటూ సెన్సాస్ బోర్డు లేఖ రాసింది. రామ్‌ గోపాల్‌ వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు అగస్త్య మంజు మరో దర్శకుడు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్‌ నటిస్తుండగా, లక్ష్మీ పార్వతిగా యగ్న శెట్టి నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here