Home తాజా వార్తలు లక్ష్మణ్, రేవంత్ ఇచ్చి పుచ్చుకోవడంలో భావమేమీటో..!

లక్ష్మణ్, రేవంత్ ఇచ్చి పుచ్చుకోవడంలో భావమేమీటో..!

293
0

ఇచ్చీ పుచ్చుకోవడంలో భావమేమిటో..? అని నిన్నటి నుంచి దిమాక్​ ఖరాబ్​ చేసుకుంటున్నా.. తెలంగాణ రాజకీయ జనాలకు  అర్థం కాని ముచ్చటొక్కటుంది. ఇదే అర్థం కాలేదురా..? నాయనా.. అని నెత్తి కొట్టుకుంటుంటే.. ఇయ్యాల ఇంకో ముచ్చట వినపడింది. ఈ రెండు ముచ్చట్ల మధ్య దిమాక్​ ఖరాబ్​ అవ్వడం మాత్రం ఖాయం. తెలంగాణ సర్కారు చేస్తున్న అవినీతిపై పోరాటం చేస్తున్నానంటూ కాంగ్రెస్​ ఎంపీ.. మాజీ బీజేపీ,, మాజీ టీఆర్​ఎస్​, మాజీ టీడీపీ.. ఇప్పటి కాంగ్రెస్​ సెకండ్​ లీడర్​ (వర్కింగ్​ ప్రెసిడెంట్​) రేవంత్​రెడ్డి.. ఆ అవినీతి ఆధారాలను బీజేపీకి ఇస్తనని ప్రకటించుండు. ఆ స్టేట్​మెంట్​కు రాజకీయ నాయకుల తలకాయలు గిర్రున తిరిగి ఉంటయ్​. ఇస్తే గిస్తే.. కాంగ్రెస్​ అధ్యక్షుడికో.. లేకుంటే సీబీఐకో అని చెప్పాలే. ఈయనేంటీ.. ఏకంగా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్​ లక్ష్మణ్​కు ఇస్తానని ప్రకటించే.

ఇదేం చిత్రంరా నాయనా.. కాంగ్రెస్​.. బీజేపీ ఉప్పునిప్పు. అలాంటిది కాంగ్రెస్​ లీడర్​ పోయి.. బీజేపీ లీడర్​కు ఇస్తానని చెప్పుడేందీ. సరే ఈయనేదో నోరుజారో లేకుంటే కడుపులోపలికెళ్లి వచ్చిందో అన్నడనుకో. మరి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్​కు ఏమైంది. రేవంత్​ ఇస్తే నేను తీసుకుంటానని చెప్పేసిండు. ఈ ముచ్చటతో జనాలకు ఇంకింత పరేషాన్​. చెప్పే లక్ష్మణ్​ ఏమని చెప్పాలే. నువ్వేందయ్య ఇచ్చేదీ.. మాకు తెల్వదా.? మేము తెచ్చుకోలేమా..? నీ అవసరం మాకేం లేదని చెప్పాలే. అట్ల కాకుండా ఆయనిస్తాని అనుడు.. ఈయన తీసుకుంటానని అనుడేంది.? దీని వెనుకు ఏమన్న దాగుడు మూతలైతే లేవు కదా..? రేవంత్ బీజేపీ పువ్వులో రెమ్మ అవుతడా ఏంటీ. ఏమో ఎవరికి తెలుసు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here