Home breaking news రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం | Road Accident

రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం | Road Accident

183
0

రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా కోదాడ స‌మీపంలో జ‌రిగింది. కోదాడ‌కు చెందిన కొంద‌రు వ్య‌క్తులు కోదాడ మండ‌లం తుమ్మ‌ర‌బండ పాలెంలో జ‌రిగిన శ్రీ సీతారామ క‌ల్యాణం తిల‌కించి ఆటోలో తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ప‌రిమితికి మించి ఎక్కువ‌మంది ప్ర‌యాణికుల‌తో వ‌స్తున్న ఆటో ముందున్న వాహ‌నాన్ని అధిగ‌మించే ప్ర‌యత్నంలో ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీకొన్నది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో వ్య‌క్తి ఆసుపత్రికి త‌ర‌లిస్తుండ‌గా మృతి చెందారు. మ‌రో ముగ్గురి పరిస్థితి విష‌మంగా ఉంద‌ని పోలీసులు తెలిపారు.

Please Subscribe our Website And Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here