Home breaking news రేపు చంద్రయాన్​– 2 ప్రయోగం‌‌ – సర్వం సిద్ధం చేసిన ఇస్రో

రేపు చంద్రయాన్​– 2 ప్రయోగం‌‌ – సర్వం సిద్ధం చేసిన ఇస్రో

229
0
నేడు చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం
చంద్ర‌యాన్-2

చంద్రయాన్ ​- 2ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమవుతోంది. శ్రీహరికోటలోని సతీశ్​థావన్​ స్పేస్​ సెంటర్​ (షార్​)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నారు. జీఎస్​ఎల్​వీ మార్క్​ 3– ఎం1 ఉపగ్రహవాహక నౌకద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వ‌హించ‌నుంది.

ఈ నెల 15న నిర్వహించాల్సిన చంద్రయాన్​– 2 ప్రయోగం సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. వారం గడవక ముందే.. లోపాలను సరిదిద్ది ప్రయోగం చేయడానికి సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్​డౌన్​ నిర్వహించే అవకాశముంది. 3,850 కిలోల బరువు కలిగిన చంద్రయాన్​ –2 ఉపగ్రహాన్ని చంద్రుడి వద్దకు పంపనన్నారు. ఇందుకోసం జీఎస్​ఎల్​వీ మార్క్​ 3– ఎం 1 రాకెట్​ ప్రయోగవేదికపై చంద్రయాన్​–2 సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here