Home జాతీయం రెండు ద‌శాబ్దాల పోలిక‌ నాడు.. నేడు హోం అఫైర్స్ తెలంగాణ‌కే

రెండు ద‌శాబ్దాల పోలిక‌ నాడు.. నేడు హోం అఫైర్స్ తెలంగాణ‌కే

246
0

హైద‌రాబాద్ః రెండు ద‌శాబ్దాల క్రితం కేంద్ర కేబినెట్‌కు నేటి కేంద్ర కేబినెట్‌కు స్ప‌ష్ట‌మైన పోలిక ఒక‌టుంది. మూడు ముఖ్య‌మైన ప‌ద‌వుల్లో పోలిక కొట్టొచ్చిన‌ట్టుగా ఉంది. 1998, 1999లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచి కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆనాటి బీజేపీ ప్ర‌భుత్వంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి గెలిచిన అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్ ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టివ‌ర‌కూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న ఎల్‌కే అద్వానీ.. గాంధీ న‌గ‌ర్ నుంచి గెలిచి ఉప ప్ర‌ధాన‌మంత్రిగా, హోం మినిష్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. హోం శాఖ స‌హాయ మంత్రిగా తెలంగాణ‌కు చెందిన చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర‌రావు (ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌) బాధ్య‌తలు చేప‌ట్టారు. స‌రిగ్గా రెండు ద‌శాబ్దాల త‌ర్వాత 2019లో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోదీ (యూపీ నుంచే గెలిచారు), హోంశాఖ మంత్రిగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న అమిత్ షా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తెలంగాణ నుంచి ఎంపీగా గెలిచిన జీ కిష‌న్‌రెడ్డి హోంశాఖ స‌హాయ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here