Home breaking news రూ. 500 ఖర్చుతో పంద్రాగస్టు పండుగనా..! సాధ్యమేనా..?

రూ. 500 ఖర్చుతో పంద్రాగస్టు పండుగనా..! సాధ్యమేనా..?

101
0
రూ.-500-ఖర్చుతో-పంద్రాగస్టు-పండుగనా..-సాధ్యమేనా

కేవలం రూ. 500 ఖర్చు పెట్టి పంద్రాగస్టు చేసుకోవాలి. ఇది సాధ్యమేనా..? అవునంటోంది సర్కారు. ఈ పద్దతి మాతోనేం కాదు.. ఏళ్ల నుంచి ఉంది. కొత్తగా మేం పెట్టిందేమీ లేదంటోంది. ఏవరు పెడితే ఏమంది కానీ.. ఈ రోజుల్లో రూ. 500తో ఏమొస్తుంది చెప్పండి. గట్టిగా మాట్లాడితే  చిన్న చేతి సంచిలో కూరగాయలు కూడా రావు. ఇక స్వీటు విషయానికొస్తే.. పుల్లారెడ్డి స్వీటు అయితే చెప్పక్కర్లేదు. సర్కారిచ్చే రూ. 500 కొనలేం కూడా. అయినా సరే రూ. 500తోనే పంద్రాగస్టు పండుగ చేసుకోవాలని నిక్కచ్చిగా ఆదేశాలున్నాయని తెలుస్తోంది. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును పెద్ద పండుగల జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. పంచాయతీ వద్ద రంగు రంగుల కాగితాలు.. అతికించి.. జెండా కర్రకు కాగితాలు అంటించడంతో పాటు వచ్చినోళ్లందరికీ స్వీట్లు కూడా ఇస్తారు. పెద్దమనుషులు వస్తే.. చాయో నీళ్లో ఇయ్యాలి. ఒకవేల పొరపాటున ఎమ్మెల్యే వస్తే అంతే సంగతులు. ఖర్చుకు అడ్డూ అదపు ఉండదు. మామూలుగా ఎంత చిన్న గ్రామ పంచాయతీ ఐనా.. రూ. 2 నుంచి రూ. 3 వేలు ఖర్చు అవుతాయి. కానీ మన సర్కారు మాత్రం కొసరి కొసరి జరుపుకోవాలని చెప్పేసింది. మీరెంతైనా ఖర్చు పెట్టుకోండి మాకు సంబంధం లేదు.. అయితే రూ. 500కు మించకుండా బిల్లు మాత్రం కచ్చితంగా బిల్లు పెట్టాలని కూడా ఆర్డరుంది సుమా. ఈ మొత్తం కొన్ని రోజుల కింద రూ.450 ఉండేదంట. ఈ మద్యే సర్కారు దయతలచి రూ. 50 పెంచిందంట సుమా. ఈ పొదుపే.. అన్నింట్లో ఉంటే.. ఈ రాష్ట్రం కాదు కాదు దేశమే బాగుపడేది. కాదంటారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here