Home breaking news రుతుస్రావంలో అయ్య‌ప్ప‌.. న‌గ్నంగా స‌రస్వ‌తి… హిందూ దేవుళ్ల‌ను అవ‌మానించ‌డం లౌకిక‌వాద‌మా..?

రుతుస్రావంలో అయ్య‌ప్ప‌.. న‌గ్నంగా స‌రస్వ‌తి… హిందూ దేవుళ్ల‌ను అవ‌మానించ‌డం లౌకిక‌వాద‌మా..?

528
0
రుతుస్రావం జ‌రుగుతున్న మ‌హిళ రెండు కాళ్ల మ‌ధ్య అయ్య‌ప్ప

దేశంలో లౌకిక‌వాదానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం వామ‌ప‌క్షాలు. ఇందులో మ‌న‌కు ప్ర‌ధానంగా క‌న్పించేవీ సీపీఎం, సీపీఐ. ఎక్క‌డ ఎటువంటి మైనార్టీల‌కు సంబంధించి మ‌త‌ప‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది అంటే.. ఈ రెండు పార్టీలు రోడ్ల మీద‌కు వ‌చ్చేస్తాయి. మ‌తోన్మాదులారా ఖ‌బ‌ర్దార్ అంటూ నినాదాలు చేస్తాయి. నినాదాలు చేసి చేసి అల‌సిపోతున్న ఈ రెండు పార్టీల‌కు దేశ ప్ర‌జ‌లు గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఐదు సీట్లలో గెలిపించారు. అయినా మాకు సీట్లు.. ఓట్లు కాదు.. ప్ర‌జ‌లే ముఖ్య‌మంటాయి. చివ‌ర‌కు ఈ పార్టీలు కేర‌ళ రాష్ట్రానికే ప‌రిమిత‌మ‌య్యాయి. అక్క‌డి ఎల్‌డీఎఫ్ ప్ర‌భుత్వం వీరిదే.

స‌రే ఇప్పుడు లౌకిక‌వాదం విష‌యానికి వ‌ద్దాం. ఈ రెండు పార్టీల‌కు లౌకిక‌వాదం అంటే కేవ‌లం ముస్లిం, క్రైస్త‌వుల కోస‌మే అనుకుంటాయి. హిందువు అనే పేరు వింటే చాలు వీటికి తాటిచెట్టంత కోప‌మొస్తుంది. మ‌తోన్మాధులారా.. అంటూ విరుచుక‌ప‌డుతుంటాయి. ఇక సీపీఎం అనుంబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ గురించి చెప్ప‌న‌ల‌వి కాదు. హిందూ దేవుళ్ల‌ను టార్గెట్‌గా చేసుకొని ర‌క‌ర‌కాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటోంది. అదే క్రైస్త‌వ వ‌ర్గానికి చెందిన వారు త‌ప్పు చేసిన‌ట్టుగా వ‌చ్చినా.. ప‌ట్టించుకోదు. కేర‌ళ‌లోని ఓ చ‌ర్చిలో న‌న్స్‌పై అత్యాచారం చేసిన ఫాద‌ర్‌ను వెన‌కేసుకొచ్చారు. అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న విడుద‌ల‌కు కృషి చేసింద‌ని, కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారుల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకు కృత‌జ్ఞ‌త‌గానే కాబోలు.. మొన్న‌టి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని చ‌ర్చీలు సీపీఎంకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. అయినా ఒక్క ఎంపీ సీటే గెలిచారు.

ఇప్పుడు కేర‌ళ‌లోని ఎస్ఎఫ్ఐ విభాగం.. హిందూ దేవుళ్ల‌ను టార్గెట్‌గా చేసుకొని పోస్ట‌ర్లు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో కోట్లాది మంది పూజించే అయ్య‌ప్ప‌ను అవ‌మానించింది. రుతుస్రావం జ‌రుగుతున్న మ‌హిళ రెండు కాళ్ల మ‌ధ్య అయ్య‌ప్పను చిత్రీక‌రించి.. అక్క‌డి వ‌ర్మ కాలేజీలో ఈ పోస్ట‌ర్‌ల‌ను అతికించారు. ఇదే కాలేజీలో గతంలో స‌రస్వ‌తి దేవిని న‌గ్నంగా చిత్రీక‌రించి పోస్ట‌లు వేశారు. క‌మ్యూనిస్టులు చెప్పే భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ ఇదేనా.? ఇది హిందూ సంఘాల‌కు వ‌ర్తించ‌దా..? హిందూ సంఘాలు చేస్తే త‌ప్పు. మీరు చేస్తే ఒప్పా..? ఇంకో విష‌యం భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ ఉండాలి అని చెప్పే ఈ కమ్యూనిస్టు పార్టీల ఏలుబ‌డిలో ఉన్న కేర‌ళ‌లో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని అరెస్ట్ చేయిస్తోంది. ఎందుకో తెలుసా..? సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టార‌ని. మ‌రి ఒక మ‌తానికి, కోట్లాది మంది పూజించే హిందూ దేవుళ్లను అవ‌మానించిన ఈ ఎస్ఎఫ్ఐ సంఘంపై కేసులు పెట్ట‌రా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here