Home ఎడ్యుకేషనల్/జాబ్స్ రిజ‌ల్ట్‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధం లేదంట- తేల్చేసిన న‌మ‌స్తే తెలంగాణ‌

రిజ‌ల్ట్‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధం లేదంట- తేల్చేసిన న‌మ‌స్తే తెలంగాణ‌

212
0
  • వికాస్ రుషి

ఇంట‌ర్ మీడియ‌ట్ ఫ‌లితాల‌కు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధం లేదని తేలిపోయింది. దీనికి సంబంధించిన ప్ర‌త్యేక క‌థ‌నం న‌మ‌స్తే తెలంగాణ‌లో లోప‌లి పేజీల్లో ప్ర‌చురిత‌మైంది. గ‌త నెల 18న ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాలు వెల్ల‌డైన తరువాత విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. వీరి సంఖ్య దాదాపు 26కు చేరింది. ఫ‌లితాలు వెల్ల‌డైన త‌రువాత విద్యార్థులు ఇంట‌ర్‌బోర్డును చుట్టుముట్ట‌డం, మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి వివ‌ర‌ణ ఇవ్వ‌డం జ‌రిగిపోయింది. అధికారుల మ‌ధ్య స‌మ‌న్వయ లోపం వ‌ల్ల అపోహ‌లు త‌లెత్తాయ‌ని, ఈ కార‌ణం వ‌ల్ల ఫ‌లితాల్లో కొద్దిమార్పులు చోటు చేసుకున్నాయ‌ని మాట్లాడేశారు. ఆ త‌రువాత మళ్లీ మంత్రి ఎక్క‌డా మాట్లాడ‌లేదు. ఆ మంత్రే కాదు ఏ మంత్రి కూడా మాట్లాడలేదు. చివ‌ర‌కు ఎమ్మెల్యేలు కూడా.

హైకోర్టు జోక్యం చేసుకున్న‌ త‌రువాత ముఖ్య‌మంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి స‌మీక్ష నిర్వ‌హించారు. పెద్ద‌మ‌న‌సు చేసుకొని ఉచితంగా రీ వెరిఫికేష‌న్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మంత్రి, ఆయ‌న‌తో పాటు అధికారుల‌ను ఆయ‌న వెన‌కేసుకొచ్చారు. గ్లోబ‌రినా సంస్థ‌పై కూడా అనుమానం వ్య‌క్తం చేయ‌లేదు. (అంత‌ర్గ‌తంగా ఏమ‌న్నారో తెలియ‌దు) ఒక్క మాజీ మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం మాట్లాడారు. విప‌క్షాల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని హెచ్చ‌రించారు. స‌రే ఇదంతా ఎందుకు గానీ రీ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. రీ వెరిఫికేష‌న్‌లో ఏ మాత్రం తేడా లేద‌ని అధికారిక దిన‌ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో క‌థ‌నం వచ్చింది. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న.. ప్ర‌య‌త్నించిన విద్యార్థులకు సంబంధించిన 53 జ‌వాబు ప‌త్రాల‌ను రీ వెరిఫికేష‌న్ చేస్తే.. ఇద్ద‌రు పాస‌య్యార‌ని తేలింది. అయితే వీర‌ద్ద‌రు రీ వెరిఫికేష‌న్‌కు ముందే పాస‌య్యార‌ని పేర్కొంది. (అంటే ప్ర‌కటించ‌డంలో తేడా ఉంద‌న్న‌మాట‌) ఈ మాత్ర‌మ‌న్నా క‌థ‌నంలో పేర్కొన‌డం సంతోషం.

రీ వెరిఫికేష‌న్ లో కొంద‌రు విద్యార్థుల‌కు ఒక‌టి నుంచి ఐదు మార్కులు పెరిగాయ‌ని పేర్కొంది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఇది ప‌క్క‌న పెడితే.. అనుభ‌వ‌జ్ఞ‌డైన ఒక‌ అధ్యాప‌కుడు మాత్రం.. ఫ‌లితాల‌కు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధం లేద‌ని చెప్పాడ‌ని పేర్కొంది. (స‌ద‌రు అధ్యాప‌కుడి పేరు పేర్కొంటే బాగుండేది) ఈ క‌థ‌నంలో ఏతా వాతా ఆయ‌న చెప్పిన‌ట్టుగా వ‌చ్చిన విష‌య‌మేమిటంటే.. ఇంట‌ర్‌బోర్డు త‌ప్పేమీ లేదు. దిద్దిన వారి త‌ప్పేమీ లేదు. అపోహాతో విద్యార్థులే ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని చెప్పారు. పాస్ ఫెయిల్ కావ‌డం స‌హ‌జం. ఇది అంద‌రికీ తెలుసు. ఒక‌టి నంచి ఐదు మార్కుల తేడాతో కొంత‌మంది విద్యార్థులు ఫెయిల్ కావ‌డం ఓకే. ఇక్క‌డ విష‌య‌మేమింటంటే.. మ‌రీ సున్నా ఒక‌టి రెండు మార్కులు రావ‌డం ఏమిటీ. ఈ కాలంలో విద్యార్థుల‌కు మరీ ఇంత త‌క్కువ మార్కులు వ‌స్తాయా..? సున్నా మార్కులు వ‌చ్చిన విద్యార్థి ప‌దో త‌ర‌గ‌తిలో ఎలా పాస‌య్యాడు..? ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ పాస‌వుకుంటూ వ‌చ్చిన విద్యార్థి స‌డ‌న్‌గా ఇంట‌ర్‌లో కేవలం సున్నా మార్కులే సాధిస్తాడా..? అంత తేడా ఉంటుందా..? ఒక‌వేళ ఇంట‌ర్‌లో సున్నా మార్క‌లు సాధించిన విద్యార్థి ప‌దో త‌ర‌గ‌తి పాస‌య్యాడంటే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, విద్యా వ్య‌వ‌స్థ‌దే త‌ప్పు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌కు సంబంధం లేకుంటే.. ఈ ప‌త్రిక‌లో ఇదే క‌థ‌నం మొద‌టి పేజీలో బ్యాన‌ర్‌గా వ‌చ్చేది. ఎక్క‌డో ఏదో జ‌రిగింది. అందుకే లోప‌లి పేజిల్లో వేశారు.

మ‌రో ప‌త్రిక సాక్షిలో వ‌చ్చిన క‌థ‌నం ప్ర‌కారం.. రీ వెరిఫికేష‌న్‌లో అనేక పొర‌పాట్లు జ‌రిగాయ‌ని తేలిన‌ట్టుగా ఉంది. కేవ‌లం ఐదు మార్కులే వ‌చ్చిన విద్యార్థికి త‌రువాత 50 మార్కులు వ‌చ్చినట్టుగా పేర్కొంది. మ‌రో విద్యార్థికి సివిక్స్‌లో 18 మార్కులు రాగా రీ వెరిఫికేష‌న్‌లో 39 మార్కులు వ‌చ్చాయ‌ని పేర్కొంది. ఏదీ ఏమైనా ఎక్క‌డో ఏదో జ‌రిగింది. లేకుంటే ప్ర‌తిదానికి ఖండించే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంట‌ర్ విష‌యంలో ఎందుకు మౌనంగా ఉన్నారు. దీన్ని సాగ‌దీయ‌కుండా మొద‌టే ప్ర‌భుత్వం త‌ప్పు ఒప్పుకొని చ‌ర్య‌లు తీసుకుంటే బాగుండేదీ. ఒప్పుకోకుండా.. ప్ర‌తిష్ట‌కు పోయి విద్యార్థుల జీవితాల‌తో ఆడుకుంటోంది. చివ‌ర‌కు త‌న భ‌విష్య‌త్‌పై కూడా ప్ర‌భుత్వం ఆడుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here