Home తాజా వార్తలు రాహుల్ వైఫ‌ల్యం బీజేపీకి లాభం / Rahul’s failure to benefit BJP

రాహుల్ వైఫ‌ల్యం బీజేపీకి లాభం / Rahul’s failure to benefit BJP

88
0

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని పెద్దలు చెప్పారు. ఎక్కడ నష్టపోబుతున్నామో గుర్తించి అక్కడే నష్టం జరగకుండా చూసుకోవాలని మోదీ చెబుతున్నారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. అలాగని ఆశాశ్వతమనీ కాదు. తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే వ్యూహాలు బట్టి జయాపజయాలు నిర్ణయమవుతాయి. ఈ సంగతి గుర్తించిన మోదీ ముందస్తుగానే రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, వేగంగా అమలు చేయడం చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెనుకబడ్డారు. ముందు మోదీ రాజకీయ నిర్ణయాలు సమీకరణాలు చర్చించుకుందాం.
గత ఎన్నికల్లో ఉత్తర భారతంలో సాధించిన ఎక్కువ సీట్ల కారణంగా మోదీ ప్రధాని కాగలిగారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈసారి అక్కడ సీట్లు తగ్గిపోతాయని కొన్ని నెలలుగా వస్తున్న కథనాలు కానీ, విడుదలైన సర్వేలు స్పష్టం చేశాయి. అక్కడ కోల్పోయే సీట్లను దక్షిణ భారతదేశంలో సాధించలేరు. కానీ పెద్దపార్టీగా నిలుస్తుంది. అధికారానికి కొద్ది దూరంలో ఉంటుందని ఆయా కథనాల సారాంశం. ఆయితే అందరూ ఊహించిన విధంగా సీట్లు కోల్పోకుండా మోదీ, ద్వయం రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మొదటిది.. కూటమిలో ఉంటూనే పక్కలో బల్లెంగా మారిన శివసేనను మచ్చిక చేసుకోవడంతో పాటు సీట్ల పంపకాలు పూర్తి చేసుకున్నారు. ఈ పొత్తు ద్వారా మహారాష్ట్రలో నష్టం జరగకుండా చూసుకున్నారు. బిహార్లో జనతాదళ్ (ఎస్) అధినేత, సీఎం నితీష్ కుమార్ తో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఈ పొత్తు కారణంగా బీజేపీ సిట్టింగ్ సీట్లను కూడా వదులుకుంటోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కుదుర్భుకున్న పొత్తు కారణంగా నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. తమిళనాడులో అధికార అన్నా డీఎంకే తో పొత్తుకుదుర్చున్నారు. గతంలో ఏమీ లేని ఈ రాష్ట్రంలో ఎన్నిసీట్లు వచ్చినా లాభమే. రాకున్నా పోయేదేమీ లేదు.
కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ అప్నాదళ్ తో చర్చలు సాగుతున్నాయి. అక్కడి పెద్ద ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ పొత్తుకుదుర్చున్నాయి. ఈ కారణంగా బీజేపీకి దాదాపు 40 సీట్లు కోల్పోతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఇక్కడ కోల్పోయే సీట్లలో సగం సీట్లను పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇతర దక్షిణాది రాష్ట్రలల్లో సాధించుకునే అవకాశాలు న్నాయి. బీహార్ లో జేడీఎస్ పొత్తు కారణంగా నష్టం కంటే లాభమే ఎక్కువ. పాకిస్థాన్ వ్యవహారం కారణంగా బీజేపీకి లాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నిటి కంటే ఎక్కువగా కాంగ్రెస్ తో పొత్తు తమిళనాడులోని డీఎంకే తప్ప మరే పార్టీ కుదుర్చుకోవడానికి సుముఖత చూపడం లేదు. ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశం. సహజంగా ప్రాంతీయ పార్టీలు.. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీతోనే వెళ్తాయి. తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి.. బీజేపీకి మద్దతు ఇస్తుంది. ఆంద్రప్రదేశ్ లోని టిడిపి కాంగ్రెస్ కు మద్దతిస్తుంది కాబట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్.. బీజేపీకి మద్దతిస్తుంది. సో.. రాజకీయ వ్యూహాలు రచించడంలో, కొత్త సమీకరణాల విషయంలో రాహుల్ గాంధీ వెనుక బడినందున బీజేపీకి కలిసి వస్తున్న అంశం. కాబట్టి ఎటుచూసినా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here