Home జాతీయం రాహుల్ రాజీనామాతో ప్రియాంకకు కాంగ్రెస్‌లో రాచబాట

రాహుల్ రాజీనామాతో ప్రియాంకకు కాంగ్రెస్‌లో రాచబాట

174
0
priyankavadra

మొత్తానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గనని కూడా చెప్పేశారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ పార్టీకి ఇతరులు అధ్యక్షులైతే.. ముందు కాంగ్రెస్ నేతలే అంగీకరించరు. ఒకవేళ అయినా.. గతంలో మాధిరిగా ఇందిర కుటుంబం ఆదేశాలను పాటించాల్సిందే. ఆ కుటుంబం సూచనలతో ముందుకు నడవాలి. ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎవరున్నా అమలు చేయాల్సిందే. ఎవరినో అధ్యక్షుడిగా నియమించి.. ఆదేశాలు జారీ చేయడం కంటే.. తమ కుటుంబ సభ్యుడినే చేస్తే పోలా..? అన్న ఆలోచనకు ఇందిర కుటుంబం (ఇప్పుడు సోనియా ) వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందిర కుటుంబం అంటే ఉన్నది ఒక్కరే అమె ప్రియాంక వాద్రా. ఆమెను తీసుకొచ్చి అధ్యక్ష పదవి అప్పగిస్తే ఎలాగుంటది అన్న చర్చ కాంగ్రెస్లో అంతర్గతంగా సాగుతోంది.

ఇప్పుడు 2016 అంతకంటే ముందు జరిగిన చర్చకు వెళదాం. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ను నియమించడం కంటే ప్రియాంకను నియమించాలన్న డిమాండ్ ఎక్కువగా ఉండేది. రాహుల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో పాటు రాహుల్ వ్యవహార శైలి గమనించిన కాంగ్రెస్ సీనియర్లు.. అధ్యక్ష పదవికి ప్రియాంక మాత్రమే సరిపోతారన్న అభిప్రాయానికి వచ్చారు. కానీ.. రాహుల్ను ప్రధానిగా చూడాలన్న సోనియా కోరిక మేరకు చివరకు రాహుల్ను అంగీకరించారన్నదీ ప్రచారం. చివరకు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించక తప్పలేదు. రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించినా.. ఎవరూ మనస్పూర్తిగా పని చేయలేదన్న ప్రచారం ఉండనే ఉంది. ఈ ప్రచారానికి లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియాంక చేసిన వ్యాఖ్యలు చేకూర్చాయి. సరే ఎలాగతైనేం.. చివరకు రాహుల్ రాజీనామా చేశారు. రాహుల్ రాజీనామా కారణంగా అధ్యక్ష పదవిలో ఇతరులను నియమించినట్టయితే.. కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు.. అభిప్రాయబేధాలు ఏర్పడుతాయి. అదే ప్రియాంక అయితే పార్టీ అధ్యక్ష పదవికి ప్రియాంకను నియమించడంలో ఎలాంటి అడ్డంకులు లేవు. కలగవు కూడా. రాహుల్ రాజీనామాతో పూర్తి స్థాయిలో ప్రియాంక ఎంటర్ కావడానికి రాచబాట ఏర్పాటైంది.

ప్రియాంక ఫేస్‌బుక్ నుంచి ఫైల్ వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here