Home తాజా వార్తలు రాహుల్ కు సాయం చేయ‌ని *న్యాయ్‌*

రాహుల్ కు సాయం చేయ‌ని *న్యాయ్‌*

165
0
  • వికాస్ రుషి

ప్ర‌ధానమంత్రి కావాల‌న్న క‌ల‌లు. అందుకోసం స‌రికొత్త ప్ర‌ణాళిక‌. ఏడాది ఒక్కో కుటుంబానికి రూ. 75 వేలు వేస్తామ‌ని రాహుల్‌ హామీ. అదే న్యాయ్ ప‌థ‌కం. తాము అధికారంలోకి రాగానే దేశంలోని పేద‌లంద‌రికీ అమ‌లు చేస్తామంటూ అతి పెద్ద ప‌థ‌కాన్ని రాహుల్ ప్ర‌క‌టించారు. ఈ స్థాయిలో సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించినా.. ప్ర‌జ‌లు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించలేదు. స‌రిక‌దా.. ఆయ‌న కుటుంబ సొత్త‌యిన అమేథీలో ఘోరంగా ఓడించారు. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌చారం చేయ‌డంలో రాహుల్ అండ్ టీం ఘోరంగా విఫ‌ల‌మైంది. ప్ర‌తి స‌భ‌లో తాము గెలిస్తే ఏం చేస్తామో అన్న విష‌యం చెప్ప‌కుండా.. ప్ర‌ధాని మోదీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు కాపాలాదారే దొంగ అంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఏ రాష్ట్రంలో ప్ర‌చారం నిర్వ‌హించినా.. అదే తీరు. ప్రచారానికి వెళ్లిన రాష్ట్రంలో స‌మ‌స్య‌లేమున్నాయి. వాటి ప‌రిష్కారానికి ఏం చేస్తామో చెప్ప‌కుండా మోదీని విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లి.. మోదీని విమ‌ర్శించ‌డ‌మెందుకు..అక్క‌డ మ‌మ‌తా స‌ర్కార్ కొలువై ఉంది. మ‌మ‌త స‌ర్కారు అమ‌లు చేస్తున్న విదానాల‌ను ప్ర‌శ్నించాలి. కానీ అక్క‌డ మౌనం. త‌మ‌కు కేంద్రంలో అవ‌స‌రం ప‌డుతుంది క‌దా.? అని. బిహార్‌కు వెళ్లినా. అదే ప‌రిస్థితి. అధికారంలోకి వ‌స్తే న్యాయ్ ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని చెప్పిన‌ప్పుడు దాని గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. కానీ అది చేయ‌లేదు. అటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శించ‌లేదు. పొత్తులు సరిగ్గా కుదుర్చుకున్నారా.. అది లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ పొత్తు పెట్టుకుందామంటే కాంగ్రెస్ నేత‌లే దూరం జ‌రిగారు. బిహార్‌లో లుక‌లుకల పొత్తు. క‌ర్ణాట‌క‌లోనూ సేమ్‌. ఒక్క త‌మిళ‌నాడులో స‌క్సెస్ అది కూడా స్టాలిన్ కార‌ణంగా. దేశంలో ఎక్క‌డా చోటు లేన‌ట్టు.. త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డే క‌మ్యూనిస్ట‌ల‌పైనే పోటీకి దిగుతున్న‌ట్టు.. కేర‌ళ‌లో రాహుల్ పోటీ చేశారు. అక్క‌డ కాకుండా.. తెలంగాణ లేదా క‌ర్ణాట‌క మ‌రే రాష్ట్రంలో కొన్ని సీట్లు అద‌నంగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశ‌ముండేదీ..? అధికారంలోకి వ‌స్తామ‌ని ఇంత హంగామా చేసిన రాహుల్ సాధించేదేమిటీ.. గ‌తం క‌న్న ఐదు సీట్లు ఎక్కువ‌. అందులో తెలంగాణ నుంచి ఒక‌టి క‌లిసొచ్చింది. ఈ ఎన్నిక‌ల్లో రాహుల్ సాధించిందేమిటంటే.. కుటుంబ సొత్త‌యిన అమేథీలో ఓడిపోయారు. వ‌ల‌స వెళ్లిన వ‌య‌నాడ్‌లో గెలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here