Home క్రైమ్ రాలిపోయిన సినీ తార *రాళ్లపల్లి *

రాలిపోయిన సినీ తార *రాళ్లపల్లి *

130
0

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాళ్ల‌ప‌ల్లి క‌న్నుమూశారు. కొంత కాలంగా శ్వాస‌కోశ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చికిత్స పొందుతూ మ్యాక్స్‌ క్యూర్‌ ఆస్పత్రిలో శుక్ర‌వారం(17న‌) సాయంత్రం మృతి చెందారు. 1979లో కుక్కకాటుకు చెప్పుదెబ్బతో రాళ్ల‌ప‌ల్లి వెంక‌ట న‌ర్సింహారావు సినీరంగంలో ప్ర‌వేశించారు. శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న న‌టించారు. అయితే ఆయ‌న న‌ట‌న‌కు మంచి గుర్తింపు ల‌భించింది మాత్రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ చిత్రాల కార‌ణంగానే.. శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, అన్వేష‌ణ చిత్రాల్లో మంచి న‌ట‌న క‌న‌బ‌రిచారు. ఏప్రిల్‌ 1 విడుదల చిత్రంలో ఆయ‌న న‌ట‌న హైలెట్‌గా నిలిచింది. సినీరంగంలో హీరోగా వెలుగొందుతున్న న‌టులంద‌రితోనూ ఆయ‌న స‌హ న‌టుడిగా న‌టించారు. తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్‌ 10న జన్మించిన రాళ్ల‌ప‌ల్లి.. విద్యార్థి దశ నుంచే న‌ట‌న‌పై దృష్టి సారించారు. తొలుత నాట‌కాలతో న‌ట జీవితాన్ని ఆరంభించిన ఆయ‌న సినీరంగంలో ప్ర‌వేశించి.. 850 చిత్రాల్లో న‌టించారు.

విల‌న్ గా రాళ్ల‌ప‌ల్లి
రాళ్ల‌ప‌ల్లి హాస్య‌న‌టుడిగానే అంద‌రికీ ప‌రిచ‌యం. అలాంటిది ఆయ‌న‌తో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ విల‌న్‌గా న‌టింప చేశారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అన్వేష‌ణ‌ చిత్రంలో రాళ్ల‌ప‌ల్లి విల‌న్‌గా న‌టించారు. ఆ సినిమాలో వ‌రుస‌గా హ‌త్య‌లు చేస్తుంటారు రాళ్ల‌ప‌ల్లి. చివ‌రి వ‌ర‌కూ హంత‌కుడు ఎవ‌రూ హీరో కార్తిక్ తెలుసుకోలేక పోతాడు. చివ‌రి హ‌త్య చేసే స‌మ‌యంలో.. రాళ్ల‌ప‌ల్లి హంత‌కుడ‌ని తేలిపోతోంది. హాస్య‌న‌టుడిగా జీవించిన ఆయ‌నజ.. విల‌న్‌గానూ జీవించారు. ఆయ‌న మృతి సినీరంగానికి తీరని లోటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here