Home తాజా వార్తలు రాధిక ఆప్టే అన్న‌ట్టు *ది వెడ్డింగ్ గెస్ట్‌* సీన్‌లో అత‌డి పేరెందుకు రాయ‌రూ..?

రాధిక ఆప్టే అన్న‌ట్టు *ది వెడ్డింగ్ గెస్ట్‌* సీన్‌లో అత‌డి పేరెందుకు రాయ‌రూ..?

215
0
రాధిక ఆప్టే అన్న‌ట్టు *ది వెడ్డింగ్ గెస్ట్‌* సీన్‌లో అత‌డి పేరెందుకు రాయ‌రూ..?
ద వెడ్డింగ్ గెస్ట్‌లో.. దేవ్‌ప‌టేల్‌, రాధిక ఆప్టే

నిజ‌మే బాలివుడ్ న‌టి రాధికా ఆప్టే ఆగ్ర‌హానికి అర్థ‌ముంది. ఆమె అన్న‌ట్టుగా మీడియాలో ఎందుకు రాయ‌రు..? ఎందుకు ప్ర‌చురించరు..? ప‌్రసారం చేయ‌రూ..? ఇది మీడియా వేసుకోవాల్సిన ప్ర‌శ్నే. ది వెడ్డింగ్ గెస్ట్‌ సినిమాలో రాధిక ఆప్టే, దేవ్‌ప‌టేల్ న‌టించిన కొన్ని సీన్లు ఇంట‌ర్‌నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రాసిన ప్ర‌తి ప‌త్రిక‌, ప్ర‌సారం చేసిన మీడియా ఈ సీన్ల‌న్నీ రాధిక ఆప్టే సీన్స్ అని మాత్ర‌మే పేర్కొన్నారు. రాధిక ఆప్టే వేసే ప్ర‌శ్న ఏంటంటే.. నా పేరుతోనే.. ఎందుకు ప్ర‌చురించి, ప్ర‌సారం చేస్తున్నారు. ఆ సీన్ల‌లో దేవ్‌ప‌టేల్ కూడా ఉన్నారు క‌దా..? ఆయ‌న పేరు.. ఎందుకు రాయ‌డం లేద‌న్న‌దే ఆమె ప్ర‌శ్న‌. ఆ ఆగ్ర‌హంతోనే.. ఏకంగా స‌మాజం పైనే విరుచుకొని పడ్డారు. స‌మాజం సైకో అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఫొటోల లీక్‌పై ఆమె ఒక వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో చాలా అద్భుతమైన స‌న్నివేశాలు ఉన్నాయి. అవ‌న్నీ వ‌దిలేసి కేవ‌లం ఒక్క సెక్స్ సీన్ మాత్ర‌మే లీక్ చేశారు. ఇది స‌మాజ‌పు మాన‌సిక ప‌రిస్థితికి అద్దం ప‌ట్టే దృశ్యం అని వ్యాఖ్యానించారట‌. లీక్ చేసిన సీన్ల‌లో తనతో పాటు దేవ్‌పటేల్ ఉన్న‌ప్పుడు రాధికా ఆప్టే సీన్స్‌ అనే ప్రచారం ఎందుకు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమె ఆగ్ర‌హంలో అర్థ‌ముంది కానీ.. ఆ సీన్ల‌ను లీక్ చేసింది ఆ చిత్రాన్ని నిర్మించిన వారో… లేక వారికి అతి ద‌గ్గ‌ర‌గా ఉన్నవారై ఉంటారు. * ది వెడ్డింగ్ గెస్ట్* సినిమా ప్ర‌మోష‌న్ కోస‌మే అలా చేసి ఉండ‌వ‌చ్చు. దొరికిన‌వి సీన్ల‌ని మీడియా ఆ ఫొటోల‌ను ప్ర‌చురించ‌వ‌చ్చు. ప్ర‌సారం చేసి ఉండ‌వ‌చ్చు. మీడియాలో వ‌చ్చింది కాబ‌ట్టి చూశామని స‌మాజంలోని వ్య‌క్తులు అంటారు. వాళ్లు చూస్తున్నారు కాబ‌ట్టి వేస్తున్నామ‌ని మీడియా అంటుంది. ఇది చెట్టు ముందా..? విత్తు ముందా..? అన్న‌ట్టుగా ఉంటోంది. ప్ర‌చురించి.. ప్ర‌సారం చేసిన మీడియాను అంటే స‌రిపోతుంది. కానీ స‌మాజం మొత్తాన్ని అన‌డం ఎందుక‌మ్మ‌డు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here