Home తాజా వార్తలు రాజ‌కీయాలు.. పాదాభివంద‌నాలు

రాజ‌కీయాలు.. పాదాభివంద‌నాలు

112
0

మ‌న దేశ‌ సంప్ర‌దాయంలో పెద్ద‌ల‌ను గౌర‌వించ‌డానికి ప్రాముఖ్య‌త ఉంది. మ‌న‌క‌న్న‌ పెద్ద‌లను క‌లిసిన‌ప్పుడు, గురువులను క‌లిసిన‌ప్పుడు పాదాభివంద‌నం చేయ‌డం ప‌రిపాటి. పెద్ద‌ల‌కు పాదాభివందం చేయ‌డ‌మ‌నేదీ.. పాత చింత‌కాయ ప‌చ్చ‌డి కింద మార్చేశారు. దాని స్థానంలో న‌మ‌స్కారం వ‌చ్చి చేరింది. కానీ అదే రాజ‌కీయాల్లో పాదాభివంద‌నం ప్రాముఖ్య‌తే వేరు. ముఖ్య స్థానంలో ఉన్న నాయ‌కులంద‌రూ త‌న‌ను గౌర‌వించాల‌ని కోరుకుంటారు. గౌరవం అంటే న‌మ‌స్కారం పెట్ట‌డం కాదు. వంగి కాళ్ల‌కు దండం పెట్ట‌డం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వ‌ర‌కూ ఈ పాదాభివంద‌నాలు పెద్ద‌గా క‌న్పించేవీ కావంట‌. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌రువాతే ఈ సంస్కృతి బాగా పెరిగిపోయింద‌ని చెప్పుకుంటారు. ఇప్పుడు అనేక మంది ముఖ్య నాయ‌కులు ఉత్తిగా న‌మ‌స్కారం పెడితే కోపంగా చూస్తార‌ని, అదే వంగి దండం పెడితే..ఆ నాయ‌కుడి ముఖంలో తేజ‌స్సు క‌న్పిస్తుంద‌ని అనుచ‌రులు బాహాటంగానే చెబుతుంటుంటారు. స‌రే ఇప్పుడు పాదాభివంద‌నం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. . పైగా ఇప్పుడు ఎన్నిక‌లు. అంతే ఇప్పుడ‌ది ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచింది.

ఆ మ‌ధ్య కుంభ‌మేళా జ‌రిగినప్పుడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ.. పారిశుధ్య కార్మికుల కాళ్లు క‌డిగి న‌మ‌స్కారం చేశారు. ఆ త‌రువాత మ‌రికొంత మందికి కూడా పాదాభివంద‌నం చేశారు. తాజాగా అకాళిద‌ళ్ నేత 93 ఏళ్ల ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌కు నరేంద్ర మోదీ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తన నామినేషన్‌లో ప్రపోజర్స్‌లో ఒకరైన 92 ఏళ్ల అన్నపూర్ణ శుక్లా కాళ్లకు కూడా నమస్కరించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ అభిమానులు ట్విటర్‌లో షేర్‌ చేసి.. ‘ భారతీయ సంస్కృతికి అద్దం పట్టారు. మోదీజీ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు పాదాభివందనం చేస్తే.. రాహుల్‌, సోనియాలు మాత్రం వయస్సులో తమకంటే పెద్దవారైన నాయకులు తమ కాళ్లు మొక్కడాన్ని ఆస్వాదిస్తారు. ఇదే రాహుల్‌కు, మోదీకి ఉన్న తేడా’ అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here