Home ఎడ్యుకేషనల్/జాబ్స్ మా రాజు గోరు మహా ధ‌ర్మ ప్రెభువులు

మా రాజు గోరు మహా ధ‌ర్మ ప్రెభువులు

177
0
  • వికాస్ రుషి

రాజు గోరి స్టేట్మెంట్ వ‌చ్చేసింది. మా ద‌ర్మ‌ప్రెభువులు. ఎంత ద‌య‌చూపిండ్రో మా మీద‌. పరీక్ష‌ల్లో పెయిలైన మా పోర‌గాండ్ల‌కు ఫ్రీగా వెరిఫికేష‌న్‌, కౌంటింగ్ చేస్త‌రంట‌. పెయిలైతే స‌చ్చిపోత‌ర మీ అయ్య‌వ్వ క‌డుపు కాలుస్త‌ర‌. స‌చ్చిపోకుండ్రి అని చెప్పే. మా పోరగాండ్ల మీద, ఆళ్ల‌య్య‌వ్వ‌ల‌మైనందుకు మా మీద‌ ఇంత ద‌యచూపిన ఇటువంటి ప్రెభువులు లోకంలోనే క‌న‌బ‌డ‌రు. మా పోర‌గాండ్లు బాగా స‌దువుకోని ఉద్యోగాలు సంపాదించుకోవాల‌ని సిన్న సిన్న నారాయ‌ణ‌, ఛైత‌న్య ఇటొంటివే ఇంకొన్ని, .పెద్ద‌పెద్ద‌ స‌ర్కారు బ‌డ్ల‌ల్ల‌ చ‌దివించిన మాబోటోళ్ల‌కు రీ వెరిఫికేష‌న్, రీ కౌంటింగ్‌ ఫీజు మాఫీ అంటే మాట‌లా..? పోర‌గాండ్ల‌ పెద్ద స‌దువుకు అడ్డం కాకుండా స్పీడ్‌గా రీ వెరిఫికేష‌న్ చూసేసీ.. అంతే స్పీడ్‌గా అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ పెట్టాల‌ని మా బాగా చెప్పిరి. ఇంత స‌క్క‌టి నిర్ణ‌యం తీసుకున్నారో ధ‌ర్మ ప్రెభువులు. ఆళ్ల‌తో క‌లిసున్న‌ప్పుడు కూడా ఇసొంటి డిసిజ‌న్ తీసుకోలేదు సారూ.

ఏరుప‌డ్డంక ఎంత స‌క్క‌టి నిర్ణ‌య‌మో. ఎంసెట్, ఇంక పెద్ద ఎగ్జామ్‌ల‌ప్పుడు కూడా సిన్న సిన్న పొర‌పాట్లు జ‌రిగిన ముచ్చ‌ట మా బాగా యాదికి పెట్టుకుండు రాజుగోరు ఆయ్ ఇటొంటివి మ‌ళ్ల జ‌ర‌గొద్దంటూ మా గ‌ట్టిగా సెప్పిండు స‌దువుల మంత్రికి, పెద్ద‌సార్ల‌కు. ప‌రీక్ష‌ల ఎక్క‌డ స‌క్క‌గా చేస్తున్న‌రో అక్క‌డికి పొయి అన్ని సంగ‌తులు తెలుసుకొని రండ్రి అంటూ ఆర్డ‌రేసిండంట‌.. ఈ ఆర్డ‌ర్ ఇనంగనే నాకు ఎంత మంచిగ‌నిపించిందో.. సార్ల‌కు శిచ్చ‌ మంచిగేసిండు. ఏరే రాష్ట్రాలు, ప‌క్క‌దేశాల‌కు పోయి అన్ని ముచ్చ‌ట్టు తెలుసుకోవాంటే ఎంత క‌ష్టం సార్ల‌కు. అది ఇమానంలో పోవాల్నాయే. సార్ల‌కు ప‌డుత‌దో ప‌డ‌దో. ఊర్ల‌ల్ల కొంద‌రికి బ‌స్సు ప‌డ‌దు క‌దా..? బ‌స్సు ప‌డ‌నోళ్లు నిమ్మ‌కాయ ముక్కుకాడ పెట్టుకొని కూసుంట‌రు సూడు. ఈసార్లు సుత అట్ల‌నే కూసుంటుడొచ్చు. పోర‌గాండ్లంద‌రూ సంఘ‌పోళ్లంద‌రూ అదేదో కంపెనీ మీద ప‌డేడ్సిరీ. ఆళ్ల త‌ప్పేమీ లేదని సార్లు డిసైడ్ చేసిండ్రు. ఎవ‌లు త‌క్క‌వ‌కు చేస్త‌నంటే.. ఆళ్ల‌కే టెండ‌ర్ ఇస్త‌రు గ‌ద‌. ఈ కంపెనీ త‌క్కువ పైస‌ల‌కు చేస్త‌నని వ‌చ్చే.. అందుకే ఇచ్చిండ్రంట‌. సూసినవ‌ మ‌న పోర‌గాండ్లు ఆ కంపెనోని మీద ప‌డి ఏడిసిరి. స‌ర్కారు సొమ్ము అంటే మ‌నంద‌రి సొమ్మేగ‌ద‌. త‌క్కువ‌కు చేసేటోని మీద ప‌డి ఏడ్తారుల్ల ఇచ్చంత్రం కాకుంటే. త‌ప్పంతా మ‌న పోర‌గాండ్ల‌దే.

స‌దువుకోండ్రా అని బ‌డికి పంపిస్తిమి. త‌క్కువ ఫీజు తీసుకున్న నారాయ‌ణ‌, చైత‌న్య ఇంకో అన్న బ‌డిలో సార్లు మంచిగ‌నే స‌దువు సెప్పిరి. ఇంట‌ర్‌బోర్డొల్లు ఎగ్జామ్ మంచిగ‌నే సేసిరి. ఆ కంపెనేందీ నోరు తిర‌గ‌త‌లేదు అదీ మంచిగ‌నే ప‌ని చేసే. మ‌న పోర‌గాండ్లే స‌దువుకోక ఫెయిలైరి. ఫెయిలైన‌మ‌న్న పిక‌ర్‌తో కొంత‌మంది స‌చ్చిరి. పెయిలైతే స‌చ్చిపోత‌ర‌. మ‌న రాజుగోరు సూడు ఎంత సక్క‌గా సెప్పిండ్రో. స‌దువే ముక్యం కాదు. అదే బతుకు కాదు. ఎగ్జామ్‌ల పెయిలైతే స‌చ్చిపోత‌ర‌. మ‌న‌కెన్ని ప‌నులు లేవు. ఏ ప‌నైనా సేసుకొని బ‌త‌కొచ్చు అని ముద్దుగా సెప్పే. మ‌న పోర‌గాండ్ల‌కేమో బుర్ర‌లు లేక స‌చ్చిపోయిరి. బుర్రున్నోడు.. రాజుగోరు సెప్పిన‌ట్టు.. పెయిల్‌కాంగ‌నే ఏదో ప‌ని సేసేటోడు. ప‌ని చేయాలంటే క‌రువా. ఎన‌క‌టికో మాట అనేటోల్లు. స‌దువుకున్నోడి కంటే.. బ‌ట్ట‌లుతికెటోల్లు న‌య‌మ‌ని. ఆళ్లు బ‌ట్ట‌లు బాగా యాదికి పెట్టుకొని ఇస్త‌రుగా అందుక‌న్న‌ట్టు. స‌దువుకున్నొనికి మైండ్ స‌రిగా ఉండ‌ద‌ని అప్పుడే సెప్పిరి.

ఓరే పోర‌గాండ్లు మ‌న‌కు ప‌ని క‌రువా సెప్పుండ్రి చేతిల బ‌డితె ప‌ట్టుకొని బ‌ర్రెలు కాసుకోవ‌చ్చు. వ‌ల ప‌ట్టుకొని సెరువుకాడికి పోయి సాప‌లు ప‌ట్టుకోవ‌చ్చు. అవి దొర‌క‌కుంటే ఎండ్ర‌కిచ్చ‌లు ప‌ట్టుకొవ‌చ్చు. ప‌క్క‌దేశాల్లో ఈటికే డిమాండ్ ఎక్కువుంది. గ‌డ్డం గీసుకునే దుకాణం పెట్టుకోవ‌చ్చు. ఇ ప‌నుల‌న్నీ సేయ‌డానికి పైస‌ల క‌ర్సు కూడా లేదు. మ‌న స‌ర్కారే బ‌ర్లు, గొర్లు, వ‌ల‌లు ఫ్రీగా ఇయ్య‌బ‌ట్టే. ఇంకా సానా ప‌నులున్న‌యి. సేసేటోనికి ప‌ని క‌రువా సెప్పు. మ‌న రాజుగోరు ఇంకో మంచిపని సేసిండుల్ల‌. సచ్చిపోయిన 16 మంది పోర‌గాండ్ల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించ‌లేదు. అది ఇస్తే ప‌రేశానే. స‌దువుల పెద్ద సారు సెప్పినట్టు మాస్ హిస్టీరియాతో ఇంకొంద‌రు స‌చ్చెటొళ్లు. సచ్చిపోవ‌డం ఈళ్ల‌కు అవ‌స‌ర‌మా సెప్పు. బ‌తికుంటే బ‌ర్రెల‌న్నా కాసుకొని నిమ్మ‌లంగా ఉండేటోడు. అయ్క‌వ్వ కూడా నిమ్మ‌లంగా ఉండేటోళ్లు. పెద్ద గుండె సేసుకొని రీ వెరిఫికేష‌న్‌, కౌంటింగ్‌ కు ఫీజు క్యాన్సిల్ సేసే మారాజు. ఇసొంటి నిర్ణ‌యాలు తీసుకుంట‌డు కాబ‌ట్టే దేశంలోనే కాదు కాదు పెపంచంలో నంబ‌ర్‌వ‌న్ మ‌నం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here