Home తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ రాజకీయ శూన్యతను భర్తీ చేస్తాం- బీజేపీ లక్ష్మణ్

రాజకీయ శూన్యతను భర్తీ చేస్తాం- బీజేపీ లక్ష్మణ్

94
0

హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను తామే భర్తీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మకం కోల్పోయారని చెప్పారు. అందుకే అందరూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయని చెప్పారు. బీజేపీలో చేరేందుకు అనేకమంది నేతలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, కుటుంబ పాలనపై పోరాటాలు, ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామన్నారు.
రాష్ట్రంలోని రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here