Home breaking news రఫేల్​పై కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

రఫేల్​పై కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

79
0

రఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వానికి  సుప్రీంకోర్టు  క్లీన్​చిట్​ ఇచ్చింది. ఈ కేసులో కీలక తీర్పును వెలువరిస్తూ పిటీషన్లను తోసిపుచ్చింది.  రూ. 59 వేల కోట్ల విలువైన రఫెల్​  యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టి.. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషన్​, కేంద్ర మాజీ  మంత్రి అరుణ్‌ శౌరి, యశ్వంత్‌సిన్హా  దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌  సుప్రీంకోర్టు విచారించింది. అనంతరం దాన్ని కొట్టివేసింది.  కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది. దీంతో రఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు  క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టైంది. అదే విధంగా కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు  రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పడంతో  ఆయనపై  దాఖలైన కోర్టు ధిక్కరణ  పిటిషన్‌ను కూడా సుప్రీం  కొట్టివేసింది. కాగా గతేడాది డిసెంబర్​ 14నే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్​చిట్​ ఇచ్చింది. అయితే.. తీర్పును మాత్రం రిజర్వ్​లో పెట్టిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here