Home జాతీయం యూరియా క్యూలో రైతు చని పోవడం యాధృచ్చికమే.. సెలవిచ్చిన మంత్రి

యూరియా క్యూలో రైతు చని పోవడం యాధృచ్చికమే.. సెలవిచ్చిన మంత్రి

150
0
మంత్రి నిరంజన్​రెడ్డి

కొంతమంది ఏదో ఒకటి మాట్లాడేస్తారు. దాంతో మెయిన్​ పేజీల్లోకి ఎక్కాస్తారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి కూడా అట్లనే మాట్లాడి.. మెయిన్​ పేజీల్లోకి ఎక్కేశాడు. యూరియా కొరతకు కేంద్రమే కారణమని కొందరు టీఆర్​ఎస్​ నాయకులు అంటుంటే.. అబ్బే ఎవరూ కారణం కాదు. అసలు కొరతే లేదు. ట్రాన్స్​పోర్టులో లేటయిందంటూ వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి చెప్పేశారు. ఇంతటితో ఆగితే బాగుండేదీ. యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు గురించి మాట్లాడుతూ అది యాధృచ్ఛికం. అసలు దానికి యూరియాకు సంబంధమే లేదంటూ మాట్లాడేశాడు. దీనికో పోలిక కూడా చెప్పేశాడు అది కూడా సినిమాకు యూరియాకు లింకు పెట్టి.

‘యూరియా కోసం నిలబడిన రైతు చనిపోయాడు. అది యాధృచ్చికంగా జరిగింది. దీనికి యూరియా  కొరత అన్నదానికి సంబంధం లేదు. సినిమా టికెట్టు కోసం క్యూలో నిలబడిన ప్రేక్షకుడు చనిపోతే.. థియేటర్​ యజమానికి సంబంధమా.? బహిరంగసభకు వచ్చిన కార్యకర్త చనిపోతే పార్టీది తప్పా.?’ అనేశాడు. ఎవరు చెప్పారో తెలియదు కానీ.. అబ్బే నా ఉద్దేశమది కాదంటూ నాలుక్కరుచుకున్నారనుకో అది వేరే విషయం. యూరియా కోసం నిలబడిన రైతు చనిపోయాడు. మంత్రి యాధృచ్చికమన్నారు. సర్కారుకు ఇబ్బంది కలిగించే వార్తల విషయంలో తెలంగాణ మీడియా తన బాధ్యత మరిచిపోతున్నట్టు అనిపిస్తోంది. మంత్రి ఈ విధంగా మాట్లాడినా.. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన ‘వెలుగు’లో వచ్చింది. కాస్తా నయం ఈనాడులో లోపలి పేజీలో వచ్చింది. సాక్షి, ఆంధ్రజ్యోతిలో కన్పించలేదు. సరే ఎక్కడోచోట చిన్నగా కని కన్పించకుండా వేసి ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here