Home breaking news యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 29 మంది మృత్యువాత‌

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 29 మంది మృత్యువాత‌

198
0
ఇంట‌ర్నెట్ ఫొటో

ల‌క్నోః ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ‌స్సు బోల్తా ప‌డిన సంఘ‌ట‌న‌లో 29 మంది మృతి చెందారు. మిగిలిన ప్ర‌యాణికులు తీవ్ర గాయాల‌కు లోనయ్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నో నుంచి ఢిల్లీకి బ‌య‌లు దేరిన యూపీ రోడ్వేస్ బ‌స్సు.. య‌మునా ఎక్స్‌ప్రెస్ వే వ‌ద్ద‌కు వ‌చ్చిన త‌రువాత ఆగ్రా స‌మీపంలో మురికికాలువ‌లోకి ప‌డిపోయింది. దీంతో ఘ‌ట‌న స్థలంలోనే 29 మంది మృతి చెందారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకొని.. స‌హాయ చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను తొల‌గించి.. గాయాల‌కు గురైన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. రోడ్డు ప్ర‌మాదంపై ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ సంతాపం ప్ర‌క‌టించారు. గాయాల‌కు గురైన వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. యూపీ ర‌వాణాశాఖ మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌లు ప‌రిహారం ప్ర‌క‌టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here