Home తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ యాదాద్రి, వేముల‌వాడ‌కు ప్ర‌త్యేక వెబ్‌సైట్‌- భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు- మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

యాదాద్రి, వేముల‌వాడ‌కు ప్ర‌త్యేక వెబ్‌సైట్‌- భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు- మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

159
0
దేవాదాయ, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైద‌రాబాద్: యాదాద్రి, వేముల‌వాడ ఆల‌యాల్లో ప్ర‌త్యేక ఐటీ విభాగాన్ని ప్రారంభించాల‌ని దేవాదాయ, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ప్ర‌త్యేక వైబ్ సైట్ ను రూపొందించాల‌ని సూచించారు. దేవాల‌యాల భూముల‌పై ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌మీక్షించారు. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, దేవాల‌య లీజు భూములపై ప్ర‌త్యేక దృష్టి సారించ‌నున్న‌ట్లు ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేద‌న్నారు. ఆస్తుల లీజుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తామ‌ని చెప్పారు. దేవాల‌య భూములకు స‌ర్వే చేసి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయ‌ల‌ని అధికారుల‌ను ఆదేశించారు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు. ఉద్యోగుల పే స్కేల్ విష‌యంలో  వారి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు. దేవాలయాల్లో 50 మైక్రాన్ల కంటే త‌క్కువ ఉండే ప్లాస్టిక్ బ్యాగుల నిషేధానికి చ‌ర్యలు తీసుకోవడంతో పాటు ప్ర‌త్య‌మ్నాయ మార్గాలను ఆన్వేషించాల‌న్నారు. పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని, వసతి గృహాల్లో పరిశుభ్రతకు పెద్ద‌పీట వేయాల‌ని చెప్పారు. కామ‌న్ గుడ్ ఫండ్ ప‌నుల్లో వేగం పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అర్చ‌కుల సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తూ ధూపదీప నైవేద్య ప‌థ‌కం ద్వారా అర్చ‌కుల గౌర‌వం వేత‌నం పెంచిన విష‌యం ప్ర‌స్తావిస్తూ స్వామి వారికి స‌రిగా ధూప‌దీపం అందుతుందో లేదో అనే విష‌యంలో అధికారులు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌న్నారు. ఆన్ లైన్ సేవ‌ల‌ను అంత‌రాయం లేకుండా కొన‌సాగించాల‌ని ఆదేశించారు. ఈ స‌మీక్ష‌లో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్,  అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, రీజిన‌ల్ జాయింట్ క‌మిష‌నర్ కృష్ణ‌వేణి,   హైద‌రాబాద్, వ‌రంగ‌ల్ జిల్లాల డిఫ్యూటీ క‌మిష‌న‌ర్లు, వివిధ జిల్లాల అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు, ఈవోలు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here