Home Uncategorized యాదాద్రి జీయర్ ‘భూ’ సీరియల్ 35 రోజులు.. అనుమానాలూ

యాదాద్రి జీయర్ ‘భూ’ సీరియల్ 35 రోజులు.. అనుమానాలూ

183
0
యాదగిరిగుట్టలో చిన్నజీయర్​కు ఇచ్చిన భూమి

చిన్న జీయర్​కు వైటీడీఏ భూమికి అమ్మిన విషయం ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది తెలంగాణ. చిన్న జీయర్​కు భూమి పుణ్యానికిచ్చినా.. ప్రాబ్లం వచ్చేదీ కాదేమో  తక్కువ పైసలు తీసుకొని సర్కారు అభాసు పాలయ్యింది. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ. 3 కోట్లు పలికే భూమిని రూ. 6 లక్షలకే కట్టబడితే అనుమానాలు రావా.? పైగా కొన్న ధర కంటే మరీ తక్కువకే అమ్మితే మరిన్ని అనుమానాలు. మొత్తానికి రూ. 9 కోట్ల తక్కువకు చిన్నజీయర్​కు భూమిని అందించారు.

ఈ భూమి అమ్మకానికి భీజం పడింది మాత్రం 35 రోజుల కింద అని మీడియా టాక్​ ఆఫ్​ దీ టాక్​. జూలై 30న ముచ్చింతల్​లో ఉన్న చిన్న జీయర్​ ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్​, ఆయన వెంట ‘మై హోం’ జూపల్లి రామేశ్వరరావు కలిసి వెళ్లారు. అక్కడో నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేంటంటే.. యాదగిరిగుట్టలో మహా సుదర్శనయాగం నిర్వహించాలని.. దీనికి సంబంధించిన చర్చలు కొద్దిసేపు నడిచినాయి. మీడియాకు లీకులు ఇచ్చేశారు. సరిగ్గా 15 రోజులకు చిన్న జీయర్​ నుంచి వైటీడీఏ(యాదాద్రి టెంపుల్​ డెవలఫ్​మెంట్​ అథారిటీ)కు లెటర్​ వచ్చింది. ఈ లెటర్​లో ‘గతంలో మాకు గుట్టలో 30 ఏళ్ల లీజుకు ఇచ్చిన స్థలాన్ని తమరు (వైటీడీఏ) తీసుకున్నందున మరో చోట 4 ఎకరాలు కేటాయించాలని, దానికి సంబంధించి పైసలు కూడా ఇస్తాం’ అని పేర్కొన్నారు.

లెటర్​ అందిన మూడోరోజే సీఎం కేసీఆర్​ యాదగిరిగుట్టకు వచ్చారు. రివ్యూ జరిపారు. ముందు అనుకున్నట్టుగా పెద్దగుట్ట(ఇప్పుడు ఇక్కడే జీయర్​కు ప్లేసు ఇచ్చింది) పరిశీలిద్దామనుకుంటే.. అప్పటికే చీకటైనందున సీఎం వెళ్లిపోయారు. ఆ తర్వాత జీయర్​ లేఖ స్పీడ్​ అందుకున్నది. రాసింది జీయర్​, పైగా సీఎం కేసీఆర్​ ముచ్చింతల్​కు వెళ్లొచ్చారు. యాదగిరిగుట్టకు వచ్చారు. ఈ వేగాన్ని చూసిన వైటీడీఏ అధికారులు.. వేగం అందుకున్నారు. రాతకోతలు పూర్తయ్యాయి. 2015లో ఎకరానికి రూ. 10.50 లక్షలు పెట్టి కొన్న భూమిని లక్షల రూపాయలు ఖర్చు చేసి డెవలఫ్​మెంట్​ చేసిన తర్వాత కూడా ధార్మిక అవసరాల కోసమే అడుగుతున్నారు కాబట్టి.. ‘భక్తి’గా  రూ. 4.50 లక్షలు తగ్గించి.. రూ. 6 లక్షలకే జీయర్​కు అమ్మేశారు.

ఈ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్​ కోసం చిన్నజీయర్​ రాలేదు కానీ ఆయన తరుపున సెప్టెంబర్​ 5న ‘మై హోం విహంగా’ సంస్థకు చెందిన జీ వెంకటరావు వచ్చారు. స్టాంప్​ అండ్​ రిజిస్ట్రేషన్​ శాఖ ఆదేశాల ప్రకారం.. రిజిస్ట్రేషన్​ జరిగిన 24 గంటల్లో పత్రాలు కొనుగోలుదారుడికి అందాల్సి ఉంటుంది. కానీ ఇలా ఎన్నడూ జరగదు.కనీసం 15 రోజులు పడుతుంది. ఈ భూమి కేసులో కూడా రిజిస్ట్రేషన్​ అధికారులు లేట్​ చేశారు. అది కూడా రెండ్రోజులే.. వెంటనే పై నుంచి హుంకరింపు.. పెద్ద అధికారి రావడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ 10వ తేదీనా రిజిస్ట్రేషన్​ పత్రాలు జీయర్​కు అందాయి.

జీయర్​కే కాదు తీన్మార్​ మల్లన్నతో పాటు పేపర్లకు కూడా అదే రాత్రి అందాయి. మల్లన్న మాత్రం తన యూట్యూబ్​లో ఉన్నదున్నట్టు చదవివేశాడు. పేపర్లలో కమ్యూనిస్టు పత్రిక నవ తెలంగాణలో మాత్రం వచ్చింది. మిగిలిన వాటిల్లో అంటే ఘనత వహించిన ఆంధ్రజ్యోతిలో కూడా  రాలేదు. లేటయిందేమో అందుకే రాలేదనుకుంటే.. తెల్లారి మాత్రం కనీకనబడకుండా లోపలిపేజీల్లో చిన్నగా వేశారు. కొద్దిగా పెద్దగా వెలుగులో వేశారు. మిగిలిన పత్రికల్లో అది కూడా రాలేదు. అందుకే కమ్యూనిస్టులు అన్నట్టు అందరూ ఒకతాను ముక్కలే. చిన్నజీయర్​కు తక్కువ రేటుకు భూమి విక్రయంపై ఇతర పార్టీలూ కూడా పెద్దగా స్పందించలేదు. వ్యతిరేకించిన సందర్భం కూడా  లేదు. మొత్తానికి ఏం జరిగిందో కానీ ఈ 35 రోజుల సీరియల్​పై మాత్రం అనుమానాలు మాత్రం నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here