Home breaking news యాదాద్రి ఆలయ నమూనే కాదు.. మూల విరాట్​నే మార్చేశారంట

యాదాద్రి ఆలయ నమూనే కాదు.. మూల విరాట్​నే మార్చేశారంట

164
0

. వికాస్​ రుషి

ప్రపంచ వ్యాప్తంగా యాదాద్రికి ప్రాచుర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. ఇది కచ్చితంగా నిజమవుతోంది. ఇప్పటికి రెండుమార్లు ప్రపంచంలో ప్రచారమైంది. మొదటిసారి ఆలయంలోని రాతి స్థంబాలపై కేసీఆర్​.. కారు విగ్రహం. రెండోస్సారి ఏకంగా ఆలయంలోని మూల విరాట్​ విగ్రహ రూపాన్నే మార్చేశారని పత్రికల్లో వచ్చేసింది. అయితే ఈ రెండు కథనాలు ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చాయి. అంటే ఇప్పుడు యాదాద్రి ఆలయ నమూనే కాదు… ఏకంగా మూల విరాట్​ను మార్చేశారు. మూల విరాట్ తలపై ఉన్న ఏడు తలల నాగ శేషుఉన ఐదు తలలకు తెచ్చారని చెబుతున్నారు.

వెంకటేశ్వర స్వామికి ఏడుకొండలెందుకు రెంఉ  కొండలు చాలు అంటూ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖరరెడ్డి చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. యాదాద్రిలోని శిల్పులు కూడా అదే అనుకున్నట్టున్నారు. మూల విరాట్​కు ఏడు తలల నాగశేషుడు ఎందుకు ఐదు తలలున్నా.. ఎండతగలదుగా అనుకున్నట్టున్నారు. అందుకే మార్చేశారు. నరసింహుడంటే శాంతమూర్తిలా ఉండకూడదని అనుకున్నట్టున్నారు. నరసింహుడిగా వచ్చిందే హిరణ్య కశిపుడిని హతమార్చేందుకు  కదా ఇక్కడ శాంతమూర్తి ఎందుకు అందుకే శాంతమూర్తికి రెండు కోరలు ఏర్పాటు చేసి ఉగ్ర నరసింహుడిగా మార్చేశారు. సో మొత్తానికి యాదాద్రిని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి పెట్టారు సీఎం కేసీఆర్​. ఇందులో ఎలాంటి అనుమానం లేదు సుమా అంటున్నారు జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here