Home breaking news యాదాద్రిలో కేసీఆర్ చిత్రం తొలగింపు.. నిన్నే తొలగిస్తే సర్కారు పరువు దక్కేదీ

యాదాద్రిలో కేసీఆర్ చిత్రం తొలగింపు.. నిన్నే తొలగిస్తే సర్కారు పరువు దక్కేదీ

143
0
స్తంభంపై కేసీఆర్​ చిత్రం

ఆలస్యం అమృతం విషం. నిదానమే ప్రధానం. ఈ రెండు ముఖ్యమైనవే. వీటిని సందర్భానుసారం ఉపయోగించుకోవాలి. నిదానమే ప్రధానమన్నారని.. కొన్ని నిర్ణయాలు నిదానంగా తీసుకుంటే పోయిన పరువు తిరిగిరాదు. ఇప్పుడు తెలంగాణ సర్కారు విషయంలో ఇదే జరిగింది. యాదగిరిగుట్టపైన ఉన్నస్తంభాలపై కేసీఆర్​, చార్మినార్​, కేసీఆర్​ కిట్​ వంటి చిత్రాలు చెక్కడంపై మీడియాలో కథనాలు రావడం.. అది రచ్చ కావడం శుక్రవారం నుంచి జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్​, వీహెచ్​పీ, భజరంగ్​దళ్​ నేతలు కొండపైకి చేరుకోవడం, ఆందోళనలు చేయడం జరిగింది.

కొండపైకి చేరుకుంటున్న బీజేపీ నేతలు.. అడ్డుకుంటున్న పోలీసులు

ఇవి జరిగిన తర్వాత ఆలస్యం చేయకుండా.. ఆ చిత్రాలను తొలగిస్తే సర్కారుకు ఇబ్బంది ఉండక పోయేదీ. కానీ ప్రతిష్టకు పోయిన సర్కారు.. విషయాన్ని కప్పపుచ్చడానికి.. వైటీడీఏ స్పెషల్​ ఆఫీసర్​ కిషన్​రావుతో శుక్రవారం రాత్రి ప్రెస్​మీట్​ పెట్టించి మరింత మరింత పరువు పోగొట్టుకున్నది.   ఇప్పుడేమో ఆగ్రహం వ్యక్తం చేసి.. ఎవరు పెట్టమన్నారని.. వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే.. ఎవరికైనా అర్థమైపోతుంది. పని చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా యజమాని చెప్పినట్టే చేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయం. యజమాని చెప్పకుండా ఏ పని చేయడు. చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. యాదగిరిగుట్టపైన స్తంభాలపై కేసీఆర్​ సహా ఇతర నేతల చిత్రాలను చెక్కే విషయంలో శిల్పులే సొంత నిర్ణయం తీసుకున్నారని చెబితే ఎవరు నమ్ముతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here