Home breaking news odisha encounter | మ‌హిళా మావోయిస్ట్ ఎన్‌కౌంట‌ర్‌

odisha encounter | మ‌హిళా మావోయిస్ట్ ఎన్‌కౌంట‌ర్‌

255
0

ఒడిశాః ఎన్‌కౌంట‌ర్‌లో మ‌హిళా మావోయిస్టు మృతి చెందారు. ఒడిశాలోని కంద‌మాల్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పుల్లో మ‌హిళా మావోయిస్టు మృతి చెందార‌ని ఎస్‌పీ ప్ర‌తీక్ సింగ్ తెలిపారు. స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ (సీఓజీ), డిస్ట్రిక్ వలంట‌రీ ఫోర్స్ (డీవీఎఫ్‌) సంయుక్తంగా త‌నిఖీలు చేప‌ట్టిన స‌మ‌యంలో మావోయిస్టులు ఎదుర‌య్యారు. ఆ వెంట‌నే మావోయిస్టుల‌కు కాల్పులు జ‌ర‌ప‌డంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జ‌రిపార‌ని, ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళా మావోయిస్టు మృతి చెందార‌ని ఎస్పీ తెలిపారు. సంఘ‌ట‌న స్థ‌లం వ‌ద్ద మూడు గ్రైనేడ్‌లు, ల్యాండ్ మైన్‌, సాహిత్యం ల‌భించింద‌ని చెప్పారు. మృత‌దేహాన్ని బ‌ల్లీగూడ స‌బ్ డివిజిన‌ల్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించామ‌ని ఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here