Home breaking news మ‌ధ్యాహ్నానానికి 40 శాతం పోలింగ్ – బెంగాల్‌లో అత్య‌ధిక పోలింగ్‌

మ‌ధ్యాహ్నానానికి 40 శాతం పోలింగ్ – బెంగాల్‌లో అత్య‌ధిక పోలింగ్‌

117
0
The female voters showing mark of indelible ink after casting their votes, at a polling booth, during the 7th Phase of General Elections-2019, at Chamba, Himachal Pradesh on May 19, 2019.

ఢిల్లీః లోక్‌స‌భ చివ‌రి ద‌శ ఎన్నిక‌ల్లో భాగంగా ఆదివారం మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి 40 శాతం పోలింగ్ న‌మోదైంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఎన్నిక‌ల‌ జ‌రుగుతున్న రాష్ట్రాల్లో ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎక్కువ పోలింగ్ న‌మోదైంది. ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ 47 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైంది. ఆ త‌రువాత స్థానాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో న‌మోదైంది. ఆ రాష్ట్రంలో 43.89 శాతం న‌మోదైంది. బిహార్‌లో 36.20, హిమాచల్‌ ప్రదేశ్‌లో 34.47, పంజాబ్‌లో 36.66, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 36.37, ఝార్ఖండ్‌లో 52.89, చండీగఢ్‌లో 35.60 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఆరు విడ‌త‌ల ఎన్నిక‌ల్లో 484 నియోజక వర్గాల్లో పోలింగ్‌ పూర్తి అయింది. ఆదివారం జ‌రుగుతున్న చివ‌రిద‌శ ఎన్నిక‌ల్లో జ‌రుగుతున్న 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లో 13 నియోజ‌క‌వ‌ర్గాల చొప్పున పశ్చిమ బెంగాల్‌లో 9, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో 8 స్థానాల చొప్పున హిమాచల్‌ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జ‌రుగుతోంది. 59 స్థానాల్లో ప్ర‌ధాన పార్టీల‌తో పాటు మొత్తం 918 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here