Home breaking news మ‌గ‌వాళ్ల‌కు కోపం తెప్పిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌

మ‌గ‌వాళ్ల‌కు కోపం తెప్పిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌

218
0
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్

ఆడ‌వాళ్ల కోపం తాటాకు మంట‌లాంటింది. ఎంతవేగంగా అంటుకుంటుందో అంతే వేగంగా చ‌ల్లారి పోతుంది. మ‌గాళ్ల కోపం బొగ్గు మంట వంటిది అంటుకోవ‌డ‌మూ ఆల‌స్య‌మే.. అంటుకుందా.. చ‌ల్లార్చ‌డం చాలా కష్టం. అందుకే చాలా మంది ఆడ‌వాళ్ల‌కు కోపం తెప్పించే ప‌నులు చేస్తుంటారు. అది ఇంట్లో అయినా.. ఆరు బ‌య‌ట అయినా.. చివ‌ర‌కు స‌ర్కారైనా.

కొత్త‌గా ముఖ్య‌మంత్రి కుర్చిలో కూర్చున్న జ‌గ‌న్ పోయి పోయి మ‌గాళ్ల‌తోనే పెట్టుకుంటున్నారు. వాళ్ల‌కు కోపం వ‌చ్చే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. మందు అమ్మ‌కాలు బంద్ చేపించేట్టుగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అక్టోబ‌ర్ 1వ తేదీ నాటికి బెల్లు షాపులు ఎత్తేస్తాడంట‌. ఊళ్ల‌ల్ల బెల్టుషాపులు ఎత్తేస్తే.. తాగాల‌నుకున్నోడు పెద్దూరుకు పోయి తాగి రావాలే. పోనీ అక్క‌డ కూడా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మందు దొర‌కుండా.. దుకాణాలు త‌గ్గిస్తడంట‌. జాతీయ ర‌హ‌దారుల‌పైన దుకాణాలు లేకుండా చేస్తాడంట‌. పైగా స‌ర్కారే బ్రాందీ షాపులు న‌డిపిస్తుందంట‌. ఇక అక్టోబ‌ర్ 1 నుంచి ఇది స‌ర్కారు బ్రాందీ షాపు అన్న పేర్లు చూడాల‌న్న‌ట్టు. పేకాట క్ల‌బ్బులు బంద్‌. ఏదో అన్‌లైన్ల ఆడుకుందామంటే.. ఆన్‌లైన్ ర‌మ్మీ, ఆన్‌లైన్ బెట్టింగ్ పై కొత్త చ‌ట్టం తెస్తాడంట‌.

ఏంద‌య్య ఈ పిచ్చి నిర్ణ‌యాలు మందు షాపులు త‌గ్గించి, త‌ర్వాత మొత్తం బంద్ చేస్తే.. ఎట్లా. సర్కారు న‌డ‌వ‌డానికి జీవిగంజి లాంటిదే బ్రాందీ. దాన్ని బంద్‌చేస్తే ఎట్లా స‌ర్కారు ఎట్లా న‌డుస్త‌దంటే.. ఎన్నిక‌ల టైంల అక్క‌మ్మ‌లు, చెల్లెమ్మ‌ల‌కు మాటిచ్చా అందుకే మందును బంద్ చేస్తానంటున్నడు. నీ మాట స‌ల్ల‌గుండ‌.. మందుతాగి బాధ‌లు మ‌ర్చిపోదామంటే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకొని మాకు మందు దొర‌క్కుండా చేస్తున్నాంటూ మ‌గాళ్ల‌కు ఎక్క‌డో కాల్తున్న‌దంట‌. మరి వారి మంట‌ను చ‌ల్లార్చేందుకు జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి. ( తాగే ఆడోళ్ల‌కు కూడా కోపం రావ‌చ్చు. వారి సంఖ్య మ‌గాళ్ల‌తో పోలిస్తే చాలా చాలా తక్కువ కాబ‌ట్టి ఇబ్బంది లేదు) అయితే ద‌శ‌లవారిగా మ‌ద్య నిషేధంపై జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆడోళ్లు మెచ్చుకుంటున్నారులే.

మ‌ద్య నిషేధం సంద‌ర్భ‌మొచ్చింది కాబ‌ట్టి.. సంబంధం లేకున్నా.. ఎన్టీఆర్ టైంల సంపూర్ణ మ‌ద్య‌నిషేధ ఉద్య‌మం గుర్తుకొస్తున్న‌ది. విష‌య‌మేమిటంటే.. అప్ప‌ట్లో ఉద‌యం అనే దిన‌ప‌త్రిక వ‌చ్చేదీ గుర్తుందా..? ఆ ప‌త్రిక దాస‌రి నారాయ‌ణ‌రావు అనే సినిమా ద‌ర్శ‌కుడు పెట్టాడు. ఆ త‌రువాత మాగుంట సుబ్బ‌రామిరెడ్డి (న‌క్స‌లైట్ల కాల్చి చంపారు) అనే మ‌ద్యం వ్యాపారీ చేతికి ఆ ప‌త్రిక వ‌చ్చింది. ఈ ఉద‌యం ప‌త్రిక‌కు అప్ప‌ట్లో పాఠ‌కుల ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉండేదీ. ఇది న‌చ్చ‌ని ఇంకో ప‌త్రిక సంపూర్ణ మ‌ద్య నిషేధ ఉద్య‌మం మొద‌లు పెట్టే విధంగా పెద్ద ప్లాన్ రూపొందించి అమ‌లు చేసింది.

ఈ ఉద్య‌మం దెబ్బ‌కు అప్ప‌ట్లో ఉద‌యం ప‌త్రిక న‌ష్టాల్లో కూరుకొని పోయింది. చివ‌ర‌కు వేర్వేరు కార‌ణాల వ‌ల్ల మూత‌ప‌డింద‌నుకో అది వేరే విష‌యం. ఆ త‌ర్వాత అదే ప‌త్రిక చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌ర్కారు న‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉంది. అభివృద్ధి పనులు కుంటుప‌డుతున్నాయంటూ క‌త‌లు రాసి రాసి తిరిగి మద్యం మార్కెట్లోకి తెచ్చేలా చేసింది. ఈ ప‌త్రిక తోటి ప‌త్రిక‌ల‌ను ర‌క‌ర‌కాల ప్లాన్లు చేసి వాటిని ఇబ్బంది పెట్టిన సంగ‌తి మీడియాలో ఉన్న పెద్ద పెద్ద త‌ల‌కాల‌కు తెలుసు.

  • సాధ‌న‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here