Home తాజా వార్తలు మోదీపై పోటీకి.. ప్రియాంక రిస్క్ తీసుకుంటారా..? | Modi vs Priyanka

మోదీపై పోటీకి.. ప్రియాంక రిస్క్ తీసుకుంటారా..? | Modi vs Priyanka

177
0
  • వికాస్ రుషి

రాజ‌కీయాల్లో ముఖ్య‌మైన నేత‌లు ఎప్పుడు త‌మ సేఫ్‌సైడ్ చూసుకుంటారు. ఎక్క‌డైతే గెలువ‌గ‌లుగుతామో..? అక్క‌డ మాత్ర‌మే పోటీ చేస్తారు. ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా తాము పోటీ చేసే స్థానాన్ని బ‌దిలి చేసుకుంటారు. లేకుంటే రెండు స్థానాల్లో పోటీ చేస్తారు. రాహుల్ మాదిరిగా. ఒక‌చోట ఓడితో మ‌రోచోట.. రెండు చోట్ల గెలిస్తే.. ఏదో ఒక‌టి వ‌దులుకోవ‌డం ప‌రిపాటి. ఇటువంటి ఘ‌ట‌న‌లు అనేకం జ‌రుగుతున్నాయి. స‌రే ఇప్పుడు అస‌లు విష‌యానికి వ‌ద్దాం. నెహ్రూ కుటుంబం నుంచి మ‌రో వార‌సురాలు కొత్త‌గా రాజ‌కీయాల్లోకి్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు కానీ. పేరు చెప్పాల్సిందే కాబ‌ట్టి… ఆమె ప్రియాంక‌. ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ సోద‌రి. ఆమె రాజకీయాల్లోకి రాగానే.. దేశంలో అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో తూర్పు ప్రాంత బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చారు కానీ, ఎన్నిక‌ల్లో పోటీ చేయడానికి ఒక నియోజ‌క‌వ‌ర్గం కావాలి. మ‌నం ముందే చెప్పుకున్న‌ట్టు సేఫ్‌సైడ్ నియోజ‌క‌వ‌ర్గం వెతుకుతూ ఉండి ఉంటారు. కానీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పోటీ చేస్తున్న వార‌ణాసిలో ప్రియాంక పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం మొద‌లైంది. ఎలాగు ప్ర‌చారం జ‌రుగుతోంది క‌దా.. అని అన్నా చెల్లెల్లు కూడా చిద్విలాసంగా న‌వ్వుతూ ఉండిపోతున్నారు. త‌ప్ప క్లారిటీ ఇవ్వ‌డం లేదు. మ‌ధ్యలో ప్రియాంక భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా వ‌చ్చేసీ.. వార‌ణాసి నుంచి పోటీ చేయ‌డానికి ఆమె సుముఖంగా ఉన్నార‌ని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇగ చూస్కో మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. మోదీ వ‌ర్సెస్ ప్రియాంక అని ఊద‌ర‌గొట్టేస్తున్నారు. రాజ‌కీయాల్లో పండిపోయిన వారు ఈ ప్ర‌చారాన్ని కొట్టేస్తున్నారు. ప్రియాంక అంత రిస్క్ తీసుకోరు అని క్లారిటీగా చెప్పేస్తున్నారు.
ఎందుకంటే..
అయోధ్య ఉద్య‌మం ఊపందుకున్నత‌రువాతే వార‌ణాసి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అడుగు పెట్టింది. అప్ప‌టివ‌ర‌కూ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ కూడా చేయ‌లేదు. 1991లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి గెలిచేశారు. అప్ప‌టి నుంచి ఇప్పటి వ‌ర‌కూ 2004లో మినహాయించి బీజేపీ గెలుచుకోవ‌డంతో పాటు మెజారిటీని పెంచుకుంటూ వ‌స్తోంది. 2009లో బీజేపీ సీనియ‌ర్ నేత ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి ఈ స్థానం నుంచి గెలిచారు. 2014 వ‌చ్చే సరికి మోదీ కోసం వ‌దిలేశారు. ఈ స్థానంలో ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా 2014లో, ప్ర‌ధానిగా ఇప్పుడు మోదీ పోటీ చేస్తున్నారు. దేశంలో కాదు కాదు ప్ర‌పంచంలో ఛ‌రిస్మా క‌లిగిన నేత‌గా ప్ర‌చార‌మైన మోదీ పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో ప్రియాంక పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మోదీ గెలిస్తే మ‌ళ్లీ ప్ర‌ధాన‌మంత్రి (బీజేపీ మెజారిటీ సాధిస్తే), కాంగ్రెస్ మెజారిటీ సాధించి, ప్రియాంక గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు మోదీ వైపే మొగ్గుచూపుతారు. ఇక ప్రియాంక విషయానికి వ‌స్తే ఈ ఎన్నిక‌ల్లో మోదీపై పోటీ చేసి ఓడిపోయిందా..? ఆమె రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన తొలినాళ్ల‌లోనే ఓడితే ప్రియాంక భవిష్య‌త్ ఏమిటీ..? ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్ శూన్యం.

కాంగ్రెస్ లో ఆక‌ర్షిణీయ‌మైన నేత ఎవ‌రంటే ప్రియాంకే. రాహుల్ కంటే ఈమెకు మార్కులు ఎక్కువ‌గా వేస్తారు. రాహుల్ ప‌ప్పుగా ముద్ర‌ప‌డి, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిన స‌మ‌యంలో ప్రియాంక ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ పార్టీ నేత‌లే బ‌హిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చిన సంగ‌తి ఇంకా ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. రాహుల్ కూడా మ‌రిచిపోయి ఉండ‌రు. ఒకవేళ వార‌ణాసి నుంచి ప్రియాంక పోటీ చేయాలి అని కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం దీని వెనుకు రాహుల్ హ‌స్తం ఉన్న‌ట్టే లెక్క‌. ఎందుకుంటే ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి త‌నకు పోటీగా ఉన్న ప్రియాంక‌ను ప‌క్క‌కు త‌ప్పించ‌డానికి ఇది అందివచ్చిన అవ‌కాశం. ఇది గుర్తిస్తే.. ప్రియాంక కూడా వార‌ణాసి నుంచి పోటీ చేయాల‌న్న రిస్క్ తీసుకోరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here