Home తాజా వార్తలు మోదీపై కాంగ్రెస్‌కు సంతోషం క‌ల్గించే స్టోరీ | INDIAS DIVIDER IN CHIEF (TIME Magazine...

మోదీపై కాంగ్రెస్‌కు సంతోషం క‌ల్గించే స్టోరీ | INDIAS DIVIDER IN CHIEF (TIME Magazine Story )

633
0
  • వికాస్ రుషి

లోక్‌స‌భ ఎన్నికల స‌మ‌యంలో కాంగ్రెస్‌కు సంతోషం మాత్రం క‌ల్గించే స్టోరీ ఒక‌టి ప్ర‌చురిత‌మైంది. అది కూడా కాంగ్రెస్‌కు ప్ర‌ధాన రాజ‌కీయ ప్రత్య‌ర్థి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై. ఈ క‌థ‌నం కూడా మామూలు ప‌త్రిక‌ల్లో కాదు. ప్ర‌పంచంలో పేరెన్నిక‌గ‌న్న టైమ్ మేగ‌జైన్ ఆసియా ఖండం ఎడిష‌న్ లో మోదీ ముఖ‌చిత్రంతో INDIAS DIVIDER IN CHIEF శీర్షిక‌తో క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. వాస్త‌వానికి ఈ ప‌త్రిక మే 20 మార్కెట్లోకి వ‌స్తుంది. కానీ.. ఇంట‌ర్నెట్‌లో ముంద‌స్తుగానే అప్‌లోడ్ చేశారు. కాబ‌ట్టి.. అంద‌రూ ఈ కథ‌నాన్ని చ‌దివేశారు . దేశంలోని అన్ని ప్ర‌ధాన జాతీయ పత్రిక‌ల‌తో పాటు ప్రాంతీయ పత్రిక‌ లతో పాటు చిన్న చిన్న ప‌త్రిక‌ల్లో వెబ్‌సైట్‌ల్లోనూ ఈ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. మన దాయాది దేశ‌మైన పాకిస్థాన్లోని ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ఢాన్లోనూ ప్ర‌చురించారు. ఈ క‌థ‌నంలో ప్ర‌ధాని మోదీని దేశ విభ‌జ‌న‌దారుగా అభిర్ణిస్తూ రాశారు. జ‌ర్న‌లిస్ట్ అతీష్ త‌శీర్ దేశ విభ‌జ‌న‌తో ఈ క‌థ‌నాన్ని ప్రారంభించారు. మోదీ పాల‌న‌లో ముస్లింలు ఇబ్బందులు ప‌డ్డారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గో హ‌త్య త‌దితర అంశాల‌ను ప్ర‌స్తావించారు. 2014లో దేశ ప్ర‌జ‌ల‌ను ఎంతో ఆశ‌పెట్టి.. విజ‌యం సాధించిన మోదీ.. ఇప్పుడు మామూలు రాజ‌కీయ నాయ‌కుడిగా మారిపోయార‌ని విమ‌ర్శించారు. మోదీని విభ‌జ‌న‌దారుడిగా పేర్కోన‌డానికి సాంస్కృతిక, మత ప‌ర‌మైన విష‌యాల‌ను ప్ర‌ధానంగా పేర్కొన్నారు. మ‌తం జాతీయవాదం పేరుతో విభ‌జ‌న‌వాదిగా మారార‌ని తన క‌థ‌నంలో ఆరోపించారు. త‌లాక్ బిల్లు గురించి కూడా ప్ర‌స్తావించారు.

టైమ్స్‌లో వ‌చ్చిన క‌థ‌నం తెలుగు ప‌త్రిక సాక్షిలో

ఈ ఆరోప‌ణ‌లు కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీలు ఎంతో కాలంగా చేస్తున్న‌వే. కాకుంటే.. ఈ స్టోరీ ప్ర‌పంచంలో పేరెన్నిక‌గ‌న్న ప‌త్రిక టైమ్‌లో రావ‌డం అది కూడా వివాద‌స్పద శీర్షిక‌ను పెట్ట‌డం సంఛ‌ల‌నం క‌ల్గించింది. లోక్‌స‌భ ఎన్నిక‌లు ఆరోద‌శ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇది రావ‌డం కాంగ్రెస్‌కు సంతోషదాయ‌క‌మే. కానీ ఇక్క‌డో ట్విస్ట్ కూడా ఉంది. ఈ క‌థ‌నంలోనే కాంగ్రెస్ బ‌ల‌హీనంగా ఉంద‌ని, ఇలాంటి బ‌ల‌హీన‌మైన ప్ర‌తిప‌క్షం ఉండ‌డం వ‌ల్లే ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి ల‌బ్ది చేకూరనుంద‌ని కూడా పేర్కొన్నారు. పైగా ఆరు, ఏడు ద‌శ‌ల ఎన్నిక‌లు ఉత్త‌రాది రాష్ట్రాల్లో జ‌రుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో హిందుత్వ ఎజెండా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఈ స‌మ‌యంలో మోదీని విభ‌జ‌నదారుడుగా పేర్కొంటూ.. అందులోనూ ముస్లింల‌కు వ్య‌తిరేకంగా చిత్రీక‌రిస్తూ క‌థ‌నం వ‌చ్చింది. చివ‌రి ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అందులోనూ హిందుత్వ ప్ర‌భావం క‌ల్గిఉండే ఉత్త‌రాదిలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ స‌మ‌యంలో ఇటువంటి క‌థ‌నం రావ‌డం ఎవ‌రికి లాభం..? ఏ ప్ర‌కారం చూసినా ఈ క‌థ‌నం వ‌ల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి ల‌బ్ది చేకూర్చే అవ‌కాశం మాత్రం క‌న్పించ‌డం లేదు. ఈ క‌థ‌నం వ‌ల్ల కాంగ్రెస్‌కు సంతోషం మాత్ర‌మే క‌ల్గిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here