Home breaking news మోదీని సాగ‌నంపే రోజొచ్చింది- రాహుల్ Rahul comments on modi

మోదీని సాగ‌నంపే రోజొచ్చింది- రాహుల్ Rahul comments on modi

668
1

హైద‌రాబాద్ః మాట‌ల మోదీని సాగ‌నంపే రోజొచ్చింద‌ని ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో ఎన్నిక‌లు ఎక్క‌డ జ‌రిగినా.. మోదీకి కాంగ్రెస్ మ‌ధ్య‌నే జ‌రుగుతాయ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మోదీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశాన్ని మోదీ విచ్చీన్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. మోదీ పాల‌న‌లో పెద్ద పారిశ్రామక మేలు జ‌రుగుతోంద‌ని, వారికి రూ. 3.50 ల‌క్ష‌ల కోట్ల రుణం మాఫీ చేశారని తెలిపారు. రైతుల‌కు మాత్రం రుణ‌మాఫీ చేయ‌డం లేద‌న్నారు. మోదీ, కేసీఆర్ ఒక్క‌టే అని.. అందుకే నోట్ల ర‌ద్దును, జీఎస్టీని స‌మ‌ర్దించార‌ని చెప్పారు. మోదీ చేతిలోని రిమోట్ కేసీఆర్ అని అన్నారు. రఫెల్ ఒప్పందంలో రూ. 30 వేల కోట్లు దోచి పెట్టార‌ని ఆరోపించారు. రూ. 526 కోట్ల విమానాన్ని రూ. 1600 కోట్ల అందుకే కొనుగోలు చేశార‌ని వెల్ల‌డించారు. ప్రతీ రోజు.. మోదీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాన‌ని చెప్పుకున్నారు. నోట్ల రద్దు చేయ‌డం ద్వారా నీరవ్ మోదీ సాయం చేశార‌ని ఆరోపించారు. మేము అధికారంలోకి వస్తే.. నీరవ్ మోదీని పట్టుకుని డబ్బు కక్కిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మహిళా రిజ‌ర్వేషన్ బిల్ అమలు చేస్తామ‌న్నారు. నేను చెప్పిందే చేస్తాన‌ని, ఎవరి ముందు త‌ల‌వంచ‌న‌ని రాహుల్ తెలిపారు.

1 COMMENT

  1. I every time used to study piece of writing in news papers but
    now as I am a user of net thus from now I am using net for articles or reviews, thanks to web.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here