Home జాతీయం మోకాలి నొప్పికా..? ఓట‌మి గాయానికి చికిత్సా..? గాయ‌బై.. ట‌్విట్ట‌ర్లో ప్ర‌త్య‌క్ష‌మైన తేజ‌స్వీ యాద‌వ్‌

మోకాలి నొప్పికా..? ఓట‌మి గాయానికి చికిత్సా..? గాయ‌బై.. ట‌్విట్ట‌ర్లో ప్ర‌త్య‌క్ష‌మైన తేజ‌స్వీ యాద‌వ్‌

180
0
Tejashwi yadav, Rjd

కొన్ని కార‌ణాల వ‌ల్ల‌.. కొంద‌రు అజ్ఞాతానికి వెళ్లిపోతారు. తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఏవేవో కార‌ణాలు చెబుతుంటారు. రాజ‌కీయ నాయ‌కులైతే మరీనూ. ఇందులో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఘ‌న‌పాటి. అక‌స్మాత్తుగా మాయ‌మై.. ప్ర‌త్య‌క్షమ‌వుతుంటుంటారు. దీనిపై బీజేపీ సెటైర్లు విసుతుంటోంది అప్పుడ‌ప్పుడు. రాహుల్ సోప‌తి ప‌ట్టినందుకో మ‌రెందుకో కానీ.. ఆర్జేడీ ముఖ్య‌నేత‌.. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు కూడా కొన్ని రోజులుగా క‌న్పించ‌కుండా పోయారు.

బిహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌లో చిన్న‌పిల్ల‌లు మృత్యువాత ప‌డుతున్నా.. ప్ర‌తిప‌క్ష‌నేత తేజ‌స్వీయాద‌వ్ ఎక్క‌డా క‌న్పించ‌క పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీన్ని ఆస‌ర‌గా తీసుకున్న ప్ర‌త్య‌ర్థులు.. తేజ‌స్వీ ఆచూకి తెలిపిన వారికి.. రూ. 5100 (మ‌రీ ఇంత త‌క్కువా..) న‌జ‌రాన ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌ట‌న పోస్ట‌ర్లు వెలిశాయి. పాపం ఈ విష‌యం తేజ‌స్వీకి తెలిసిన‌ట్టుంది. ఎట్ట‌కేల‌కు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. కాకుంటే. అదికూడా ట్విట‌ర్ల‌లోనే. మోకాలి నొప్పి కార‌ణంగా తాను చికిత్స తీసుకున్నాన‌ని అది కూడా బిహార్‌లోనే అని ఆయ‌న పేర్కొన్నారు. ఆయ‌న స్టేట్‌మెంట్ ఈ విధంగా ఉంది.

నా కార‌ణంగానే పీఎం.. తేజ‌స్వీ

ఏసీఎల్ (మోకాలి నొప్పి) గాయానికి సంబంధించి కొన్ని వారాలుగా చికిత్స పొందుతున్నాన‌ని తేజ‌స్వీ తెలిపారు. నేను క‌న్పించ‌డం లేద‌ని ప్ర‌త్య‌ర్థుల‌తో పాటు మీడియాలోని కొంద‌రు క‌థ‌నాలు రాయ‌డం చూసి తాను ఆశ్చ‌ర్య‌పోయాన‌ని పేర్కొన్నారు. మెదడు వ్యాపు వ్యాధి కార‌ణంగా మృతి చెందిన పిల్ల‌ల‌కు సంతాపం వ్య‌క్తం చేశారు. పిల్ల‌ల‌ కుటుంబసభ్యులను కలిసి వారిని పరామర్శించాలని పార్టీ కార్యకర్తలకు సూచించానని చెప్పారు. ఈ విషయంలో ప్ర‌చారం వ‌ద్ద‌ని తాను చెప్పాన‌ని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా తమ పార్టీ ఎంపీలకు సూచించానని, అందువల్లే ప్రధాని ఈ అంశంపై స్పందించారని తేజ‌స్వీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయ‌న మోకాలి నొప్పి కార‌ణంగా.. చికిత్స పొందుతూ ఆజ్ఞాతంలో ఉన్నారో.. లేక ఓట‌మి కార‌ణంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారో అన్న ప్ర‌చారం మాత్రం జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here