Home breaking news మేమేమన్నా.. మీ ఇంటి నౌకర్లమా..? సర్కారుకు సురుకు పెట్టిన సర్పంచులు

మేమేమన్నా.. మీ ఇంటి నౌకర్లమా..? సర్కారుకు సురుకు పెట్టిన సర్పంచులు

421
0
మాట్లాడుతున్న యాదాద్రి జిల్లాలోని లక్ష్మీదేవికాల్వ సర్పంచ్​ అంజయ్య

మేము చెప్పినట్టు  కాకుంటే.. సస్పెండ్​ చేస్తామంటూ బెదిరిస్తున్న సర్కారుకు సర్పంచ్​లు సురుకు పెట్టారు. సస్పెండ్​ చేయడానికి మీ ఇంటి నౌకర్లం కాదు. ప్రజలు ఓట్లేస్తే గెలిచినోళ్లమంటూ డైరెక్ట్​గా ముఖం మీదే చెప్పేశారు. ఇచ్చిన టార్గెట్​ ప్రకారం మొక్కలు నాటకుంటే, వాటిని కాపాడకుంటే సర్పంచ్​లను, కార్యదర్శులను సస్పెండ్ చేస్తమంటూ ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పిన సంగతి యాదుండే ఉంటది. కేసీఆరే అన్నడు.. ఇక మనం స్వారీ చేద్దామనుకున్న అధికారులతో.. 30 డేస్​ ప్రణాళికపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన సదస్సులోనే సర్పంచ్​లు నేరుగా ఫైటింగ్​కే దిగారు. ఇదంతా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గుంటెండు భూమి లేనప్పుడు మొక్కలు ఎక్కడ నాటాలంటూ సర్పంచ్​లు వేసిన ప్రశ్నలకు అధికారులు భిక్కముఖం వేశారు.

మీరు భూమిస్తే నాటుతం.. లేకుంటే ఐదు వేలు కాదు ఐదు వందలు కూడా నాటమంటూ తెగేసి చెప్పేశారు. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఇవ్వకుంటే అవెట్ల బతుకతయంటూ ప్రశ్నించారు. శ్మశాన వాటికలంటున్నరు బాగానే ఉంది కనీ సర్కారు జాగే లేనప్పుడు చచ్చిపోయినోళ్లను బొందలు పెట్టడానికి వాటికలు ఎక్కడ ఏర్పాటు చేయాలే అంటూ నిలదీశారు. సర్కారు కొనిస్తే మేము బొందల జాగ ఏర్పాటు చేస్తమంటూ చెప్పేశారు. మనుష్యులను కరుస్తున్న కుక్కలను చంపిస్తే.. సర్పంచ్​లను సస్పెండ్​ చేస్తారా..? కరిచే కుక్కలను చంపించకుండా ఏం చేస్తరంటూ ప్రశ్నించారు.

తెల్లబట్టలేసుకొని తిరుగుతున్నరు.. ఈళ్లకేందనుకుంటున్నారేమో..? ఈ బట్టల వెనుక ఎన్ని బాధలున్నాయో మీకేం ఎరుక అంటూ బాధపడిపోయారు. సర్పంచ్​, వార్డు మెంబర్లుగా గెలవడమంటే.. ఎమ్మెల్యే గెలిచినంత ఈజీ కాదు గుర్తు పెట్టుకోండంటూ వ్యాఖ్యానించారు.  ఇక్కడ ఇంకో ముచ్చట ఈ వార్త ఒక్క ‘వెలుగు’ పత్రికలోనే వచ్చింది.. మిగతా పత్రికల్లో రాలేదు సుమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here