Home breaking news మేము దానికి వ్యతిరేకమే.. ఎట్టకేలకు స్పందించిన ప్రియాంక

మేము దానికి వ్యతిరేకమే.. ఎట్టకేలకు స్పందించిన ప్రియాంక

103
0
మేము దానికి వ్యతిరేకమే.. ఎట్టకేలకు స్పందించిన ప్రియాంక
ప్రియాంక వాద్రా

ఆర్టికల్​ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేస్తున్నామని కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకవాద్రా.. స్పష్టం చేశారు. ఆర్టికల్​ 370 రద్దుపై కాంగ్రెస్​లో భిన్నాభిప్రాయాలు.. వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్టికల్​ 370ని రద్దు చేసిన తరువాత ప్రియాంక స్పందించలేదు. రద్దుపై ఆమె వైఖరి ఏంటన్న అంశంపై కాంగ్రెస్​లో చర్చ మొదలైంది. దీంతో ఆర్టికల్​ 370 రద్దు చేసిన 10 రోజుల తర్వాత  ప్రియాంక వాద్రా స్పందించారు. ఆర్టికల్​ 370 రద్దు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రద్దు తీరు రాజ్యాంగబద్ధంగా లేదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కేంద్రం తుంగలో తొక్కిందని ఆమె విమర్శించారు. ఎట్టకేలకు ప్రియాంక స్పందించడంతో కాంగ్రెస్​ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here