Home breaking news మునిసిపాలిటీపై సర్కారుకు సురుకు పెట్టిన హైకోర్టు

మునిసిపాలిటీపై సర్కారుకు సురుకు పెట్టిన హైకోర్టు

196
0
మునిసిపాలిటీపై సర్కారుకు సురుకు పెట్టిన హైకోర్టు

మునిసిపాలిటీ ఎన్నికలపై సర్కారుకు హైకోర్టు సురుకు పెట్టింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. 109 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పి.. వారం రోజుల్లో ఎలా చేశారని నిలదీసింది. 109 రోజులన్నది 100 రోజుల్లో చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. వారం రోజుల్లోనే పూర్తి చేశారంటే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించింది. కొత్త చట్టం తెచ్చామని చెప్పి పాత చట్టంతో ఎన్నికల నిర్వహణ ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ సరిగ జరగలేదని పలు మున్సిపాలిటీ ఎన్నికలపై సింగిల్‌ జడ్జి స్టే ఆదేశాల్ని రద్దు చేయాలని, పిల్స్‌ను కొట్టేయాలని ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎన్నికల ప్రక్రియను 109 రోజుల్లో చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్క రోజులోనే చేస్తామంటే ఎలాగని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్త మునిసిపల్​ చట్టానికి, పాత మునిసిపల్​ చట్టానికి మధ్య తేడా ఏముందని కూడా ప్రశ్నించింది. గతంలో కోరిన గడువును తగ్గించి పనులు ఏ విధంగా చేశారో.. చెప్పడంతోపాటు మునిసిపల్​కు సంబంధించిన కొత్త, పాత చట్టాల మధ్య తేడా ఏంటో కూడా చెప్పాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here