Home breaking news మీడియా చేదు కబురు మోజో టీవీ మూసివేత

మీడియా చేదు కబురు మోజో టీవీ మూసివేత

201
0
మీడియా చేదు కబురు మోజో టీవీ మూసివేత
మోజో టీవీ

ఈ ఏడాదిలోనే మీడియాకు ఇంకో చేదు కబురు మోజో టీవీని మూసేశారు. ఈ మేరకు ఈ చేదు వార్తను జర్నలిస్టులకు చేరవేశారు కూడా. కాకుంటే ఏమన్నా ఇస్తారేమోనని మోజోలో పని చేసిన జర్నలిస్టులందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద 160 జర్నలిస్టు కుటుంబాలున్నాయి. సరే ఈ మోజో ఛానల్​ పెట్టినప్పటి నుంచి వివాదాస్పద వార్తలతోనే సాగింది.

శబరిమల ఇష్యూతో ఈ చానల్​ పెద్దగా ప్రచారం పొందింది. ఇద్దరు యాంకర్లను కూడా పంపించి మరీ చరిత్రకెక్కింది. చర్చల్లో హమారా ప్రసాద్​ అనే దళిత వ్యక్తిని అవమానించినట్టు.. ఆయన కూడా ఈ చానల్​ మాజీ సీఈవో రేవతిపై కేసు కూడా పెట్టారు. టీవీ 9 విక్రయించిన తర్వాత ఈ చానల్​ వ్యవహారం రచ్చకెక్కింది. ఆ ఛానల్​ సీఈవో రేవతి ఎంత హడావుడి చేసినా.. చివరకు టీవీ 9కు అప్పగించాల్సి వచ్చింది. ఈ చానల్​ను బలవంతంగా స్వాధీనం చేసుకున్న టీవీ 9 యాజమాన్యం.. చివరకు ఇదే చానల్​ను వదిలించుకోవాలని అనుకున్నది. అందుకే ఈ ఛానల్​ను మూసేసిస్తున్నట్టు జర్నలిస్టులకు తెలిపింది. మూసివేత నిజమే.. పోరాటం చేసిన వృథాయే. ఇంకెందుకు అనుకున్నారేమో ఉద్యోగులు.. సరే ఉద్యోగంలో చేరిన సమయంలోని అగ్రిమెంట్​ను అమలు చేయమని కోరుతున్నారు. అగ్రిమెంట ప్రకారం.. ఉద్యోగులకు మూడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై సోమవారం స్పష్టత ఇస్తామని టీవీ 9 యాజమాన్యం చెప్పిందని సారాంశం.

సరే ఈ ఏడాదిలో మీడియాకు అందిన మొదటి చేదువార్తను కూడా గుర్తుకు చేసుకుంటే మంచిదేమో. ఇదే ఏడాది మే 4వ తేదీన విజయక్రాంతి అనే ఏడాది వయసున్న దినపత్రిక మూతపడింది. ఆ దినపత్రిక మూతపడిన సమయంలో 100 మంది జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పుడెవరూ స్పందించలేదు. ఇప్పుడెవరూ స్పందించరు. జర్నలిస్టుల జీవితాలు ఇంతే. పక్కవాడి కష్టాలను చిత్రీకరించి, ప్రచురించి, ప్రసారం చేసి ప్రజలకు చూపిస్తారు. వారి జీవితాలను మాత్రం చూపించుకోలేరు. రాసుకోలేరు. ప్రసారం చేయలేరు. ఇది వారి దౌర్భాగ్యం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here