Home జాతీయం మీడియాపై స్పీకర్ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిందే

మీడియాపై స్పీకర్ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిందే

133
0
స్పీకర్ రమేశ్ కుమార్

నీ ఊరు కొస్తా.. నీ వీధి కొస్తా.. నీ ఇంటికొస్తా.. చూసుకుందామా..? ఇది ఒక సినిమాలో బాలక్రిష్ట డైలాగ్. ఇదే డైలాగ్ను కొద్దిగా మార్చి మీడియాకు వర్తింప చేయవచ్చు. అక్కడ ఇక్కడ కాదు ఎక్కడికైనా వస్తా నాకు వార్త కావాలి.. ఇది మీడియా డైలాగ్. ఏడు నెలలుగా కర్ణాటకలో రాజకీయ డ్రామా రోజు రోజుకు రక్తి కడుతోంది. జేడీ (ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ఎప్పుడు కూలుతుందో తెలియని విధంగా సాగిపోతోంది. రోజు రోజుకు మసాల అందిస్తున్న ఈ పరిణామాలపై అక్కడి మీడియా డేగ కన్ను వేసింది.

రెండు రోజుల కిందటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్సింగ్ రాజీనామా చేయడం.. ఆ రోజే మరికొంత మంది ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నారని ప్రచారమూ జరిగింది. ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో ఉన్నట్టుండి.. కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలకు చెందిన 11 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామంతో అలర్టైన మీడియా ఎవరు ఎటు వెళ్తున్నారో వార్తలు సేకరిద్దామని చూస్తున్న సమయంలో స్పీకర్ రమేశ్ కుమార్.. ఆస్పత్రిలో ఉన్న తమ బంధువును పరామర్శించడానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న మీడియా.. ఆస్పత్రి బయటే కాపుకాసి.. ఆయన బయటకు వచ్చారో లేదో.. చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ పరిణామంతో ఆగ్రహానికి లోనైన ఆయన.. మీరు మనుషులా..? ఎక్కడ ఏమి అడగాలో కూడా తెలియదా..? నా బంధువు ఆస్పత్రిలో ఉంటే చూడ్డానికి వచ్చా. ఇక్కడకు కూడా వచ్చి ఏం అడుగుతున్నారు. పరామర్శకు వస్తే మీకు మార్తలు కావాలా.? అని మండిపడ్డారు. స్పీకర్ ఆగ్రహంతో బిక్కచచ్చిపోయిన మీడియా ప్రతినిధులు మీరు మనుషులా కాదా..? అనడం తగదని ఆవేదనకు లోనవుతున్నారు. ఇక్కడ కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ ఆగ్రహం అర్థం చేసుకోవాల్సిందే.

ఆయన వచ్చింది ఆస్పత్రికి.. అక్కడ కూడా రాజకీయాల గురించి ప్రశ్నిస్తే ఎలా..? మీడియా కూడా అర్థం చేసుకోవాలి. కానీ మీడియా ప్రతినిధులు ఏం చేస్తారు పాపం.. అసలే భద్రత లేని ఉద్యోగాలు.. సాయంత్రం ఆఫీసుకు వెళ్లే సరికి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు.. ఉద్యోగం కాపాడుకోవాలంటే.. ఇలాంటివి తప్పవు స్పీకర్ కూడా అర్థం చేసుకోవాలి. సందర్భమొచ్చింది కాబట్టి.. టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రశాక్ ను ఒక సందర్భంలో ఒకరు అడిగారట ప్రమాదకర పరిస్థితులో ఉన్న వ్యక్తికి ముందు సాయం చేయాలా..? వార్త సేకరించాలా..? అని ఒకరు అడిగితే.. ముందు వార్తే సేకరించాలని చెప్పాట్ట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here