Home breaking news మా స‌ర్వే.. మా ఎగ్జిట్ పోల్స్ మా ఇష్టం.. నమ్మితే న‌మ్మండి లేకుంటే లేదు

మా స‌ర్వే.. మా ఎగ్జిట్ పోల్స్ మా ఇష్టం.. నమ్మితే న‌మ్మండి లేకుంటే లేదు

178
0
  • వికాస్ రుషి

ఎవ‌రిష్టం వారిది. ఎవ‌రి పార్టీ వారిది. ఎవ‌రి సంస్థ వారిది. ఎవ‌రి స‌ర్వే వారిది. నా స‌ర్వే నా ఇష్టం. మీ మీద రుద్దుతాం న‌మ్మితే న‌మ్మ‌డి లేకుంటే లేదు అన్న‌ట్టుగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు. లోక్‌స‌భ ఎన్నిక‌ల తుది విడ‌త పోలింగ్ అలా ముగిసి ముగియ‌క ముందే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌ల చేశారు. అది ఒక్కో ఎగ్జిట్ పోల్ ఫ‌లితం ఒక్కో ర‌కంగా ఉంది. కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే.. మ‌రికొన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. * రాజ‌గోపాల్ ఫోరం ఫ‌ర్ లీగ‌ల్ అంబులెన్స్ సోష‌ల్ అండ్ హెల్త్ స‌ర్విసెస్* (ఆర్‌జీ ఫ్లాస్ టీం) నిర్వ‌హించిన ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌, స‌ర్వే ప్ర‌కారం.. ఫ‌లితాలు టీడీపీకి అనుకూలంగా వ‌చ్చాయి. ఐఎన్ఎస్ఎస్, ఎలైట్ నిర్వ‌హించిన స‌ర్వే కూడా టీడీపీకే అనుకూలంగా ఉంది. ఇండియా టుడే స‌హా మ‌రో రెండు సంస్థ‌లు నిర్వహించిన స‌ర్వే వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లున్న‌యంటే.. న‌మ్మితే న‌మ్మండి లేకుంటే లేదు అన్న‌ట్టుగా ఉన్నాయి. 23న విడుద‌ల‌య్యే ఫ‌లితాలు ఈ పోల్స్‌కు ద‌గ్గ‌ర లేకుంటే.. జ‌నం ఏమ‌నుకుంటారు..?

ల‌గ‌డపాటి టీం ఎగ్జిట్ పోల్స్‌

టీడీపీ- 100-110, వైసీపీ72-79, జ‌న‌సేన+ ఇత‌రులు- 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు
ఎంపీః టీడీపీ 15-17, వైసీపీ 10-12, ఇత‌రులు 1
ఎలైట్ ఎగ్జిట్ పోల్స్‌
టీడీపీ- 106, వైసీపీ-68, జ‌న‌సేన-1
ఎంపీలు టీడీపీ-17-18, వైసీపీ-8-9
ఐఎన్ఎస్ పోల్స్‌
టీడీపీ- 118, వైసీపీ-53, జ‌నసేన‌-5 ,
ఎంపీలు టీడీపీ 17, వైసీపీ -7, జ‌న‌సేన‌- 1

ఇండియా టుడే స‌ర్వే
టీడీపీ 37-40, వైసీపీ 130-145, జ‌న‌సేన 0-1
టీడీపీ-4-6, వైసీపీఐ 18-20

పీపుల్స్ ఫ‌ల్స్ స‌ర్వే
వైసీపీ- 112, టీడీపీ-59, జ‌న‌సేన‌-4
ఎంపీలు- వైసీపీ 18-21, టీడీపీ, 4-8, జ‌న‌సేన 0-1

రీస‌ర్చ్ ఎఫ్ ఎక్స్ స‌ర్వే
వైసీపీ- 96, టీడీపీ- 65, జ‌న‌సేన -14

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here