Home breaking news మా ఎమ్మెల్యేల‌ను ఎంత‌కు కొన్నారు అసెంబ్లీ ఎదుట టీ కాంగ్రెస్ ధ‌ర్నా

మా ఎమ్మెల్యేల‌ను ఎంత‌కు కొన్నారు అసెంబ్లీ ఎదుట టీ కాంగ్రెస్ ధ‌ర్నా

207
0

కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం స‌క్కును ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంత‌కు కొన్నారో చెప్పాల‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నామంటూ ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఎదుట టీ కాంగ్రెస్ ధ‌ర్నా చేసింది. గ‌త శాస‌న‌స‌భ‌లోనూ ఇదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు కూడా అదే జ‌ర‌గ‌డంతో కాంగ్రెస్ పూర్తిగా ఢీలా ప‌డిపోయింది. ఒక వైపు పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు, నాయ‌క‌త్వంపై ఆరోప‌ణ‌లు వీటితో పాటు పార్టీ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజ‌ర్ కావ‌డం, పైగా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేర‌డంతో తలుగుదేశం త‌ర‌హాలో కాంగ్రెస్ క‌థ కూడా తెలంగాణ‌లో కంచికే అన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యానికి కాంగ్రెస్‌లో ఐదుగురికి మించి ఎమ్మెల్యేలు మిగిలే అవ‌కాశం లేద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఎమ్మెల్యేల పార్టీ మారుతున్న అంశంపై. సీఎం కేసీఆర్‌ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేయాలనే దురుద్దేశంతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఉత్తమ్ సహా ప‌లువురు నేత‌లు ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here