Home తాజా వార్తలు మాట్లాడుకోకుండా ఉండ‌లేం.. ఆడ, మ‌గ ప్రేమ కూడా స‌హ‌జ‌మే.. వ‌నిత

మాట్లాడుకోకుండా ఉండ‌లేం.. ఆడ, మ‌గ ప్రేమ కూడా స‌హ‌జ‌మే.. వ‌నిత

143
0
మాట్లాడుకోకుండా ఉండ‌లేం.. ఆడ, మ‌గ ప్రేమ కూడా స‌హ‌జ‌మే..వ‌నిత‌
వ‌నిత విజ‌య‌కుమార్

ఆడ మ‌గ ఒక్కచోట ఉన్న‌ప్పుడు మాట్లాడకుండా ఎలా ఉండ‌గ‌ల‌ర‌ని త‌మిళ న‌టి వ‌నిత విజ‌య‌కుమార్ ప్ర‌శ్నించారు. ఇద్ద‌రూ ఒకే చోట ఉన్న‌ప్పుడు ప్రేమ‌లో ప‌డ‌డం కూడా స‌హ‌జ‌మేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ వ్యాఖ్యాత‌గా బిగ్‌బాస్ (త‌మిళ‌) రియాల్టి షో బుల్లితెర ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతోంది.

ఈ గేమ్ షో లో 18 మంది సినీ సెల‌బ్రిటీలు స‌భ్యులుగా ఉండ‌గా. మొద‌ట న‌టి ఫాతిమా ఎలిమినేట్ కాగా.. గ‌త వారం మ‌రో న‌టి వ‌నితా విజ‌య‌కుమార్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె మీడియాతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. బిగ్‌బాస్ నుంచి తాను ఎలిమినేట్ అవుతాన‌ని అస‌లూహించ‌లేద‌న్నారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన వారంద‌రూ ఈ షోను విమ‌ర్శంచిన‌ట్టుగా తాను విమ‌ర్శించ‌న‌ని పేర్కొన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌న్ని రోజులు త‌న‌కు ఎలాంటి అసౌక్యర్యం క‌ల‌గ‌లేద‌ని ఆమె తెలిపారు.

బిగ్‌బాస్ షోలో ఆడ‌మ‌గ క‌లిసి వంద రోజులుంటారు కాబ‌ట్టి ప్రేమలో ప‌డిపోతార‌ని, అదే విధంగా తాను కూడా ప్రేమ‌లో ప‌డిపోతాన‌ని ప్రేక్ష‌కులు భావించార‌ని చెప్పారు. అయితే ఆడ మ‌గ ఒక్క‌చోట ఉన్న‌ప్పుడు మాట్లాడుకోకుండా ఉండ‌లేరు. ప్రేమ‌లో ప‌డ‌డం కూడా స‌హ‌జ‌మేన‌ని తెలిపారు. అయితే తాను మాత్రం ఎవ‌రినీ ప్రేమించ‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. నేను ముగ్గురు పిల్ల‌ల‌కు త‌ల్లిని.. నాకంటూ బాధ్య‌త‌లున్నాయి. అలాంట‌ప్పుడు ఎలా ప్రేమ‌లో ప‌డ‌తాను అని వ‌నిత విజ‌య‌కుమార్‌ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here