Home breaking news మహా సీఎం సీటు పంచుకుంటారా.. తెంచుకుంటారా..?

మహా సీఎం సీటు పంచుకుంటారా.. తెంచుకుంటారా..?

120
0

బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట పడింది. మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలో రావడం ద్వారా.. శక్తిని నిరూపించుకోవాలని ఆశించింది. దీనికి తగ్గట్టుగానే.. ప్లానింగ్​ చేసినా.. ఎక్కడో దెబ్బకొట్టింది. ఆశించిన ఫలితం రాలేదు. గతంలో సొంతంగా గద్దెనెక్కిన హరియాణలో డిప్యూటీ పదవిని దుష్యంత్​ సింగ్​కు అప్పగించాల్సి వచ్చింది. మహారాష్ట్ర విషయానికొస్తే.. అధికారం పంచుకుంటేనే సై అని బీజేపీ మిత్రపక్షం శివసేన కటింగ్​ ఇస్తోంది. పంచుకోకుంటే.. మాదారి మాదే అన్నట్టుగా చెబుతోంది. రాజకీయ పార్టీకి అధికారం అనేది ముఖ్యం. అందుచేత శివసేన వాదనలో తప్పేం లేదు. పైగా ఎన్నికల ముందే ఒప్పందం చేసుకున్నామని చెబుతోంది. అయితే ఈ ఒప్పందం ముచ్చట ఇప్పటివరకూ శివసేన చెప్పలేదు.

ఒప్పందం ఉందనే అనుకుందాం. పోటీ చేసిన సీట్లలో సీఎం సీటుకు సరిపడా… బీజేపీకి సీట్లు వచ్చి ఉంటే శివసేన ఏం చేసేదీ.  దీనికి జవాబు లేదు. ఉండదు కూడా. పంపకంలో విషయంలో ఇక్కడ వచ్చిన చిక్కల్లా బీజేపీకే. ఐదేళ్లు సొంతంగా ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న బీజేపీకి సీటు పంచుకోవాలంటే.. కంపరం కల్గిస్తున్నట్టుగానే ఉన్నట్టుంది. అందుకే మౌనంగానే ఉంది. అంతా జాతీయ నేతలు చూసుకుంటారు. నాదేముంది అన్నట్టుగా ఫడ్నవిస్​ భావిస్తున్నట్టున్నారు. బీజేపీ రాజకీయాలు తక్కువేం కాదు. 2014 ఎన్నికల్లో శివసేన షరతులు నచ్చక. ఒంటరిగా పోటీ చేసి.. 122 సీట్లు గెలుచుకుంది. శరద్​పవార్​తో ఒప్పందం కుదుర్చుకొని సీఎం సీటుపై కూర్చుంది. కూర్చున్న వెంటనే.. శివసేనను టార్గెట్​ చేసుకొని ఆ పార్టీ ఎంపీ సురేశ్​ ప్రభుని పార్జీలోకి లాగేసుకుంది. ఆంధ్రప్రదేశ్​ నుంచి రాజ్యసభకు పంపించి.. రైల్వే శాఖ మంత్రిని చేసింది. ఆ తరువాతే ఏం జరిగిందో కానీ.. మళ్లీ శివసేన దగ్గరకి రావడం.. కలిసి పోవడం జరిగిపోయింది.

అవకాశవాద రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ.. కాంగ్రెస్​ను మించి పోయింది. ఇప్పుడా కాంగ్రెస్​కే రాజకీయాలు నేర్పుతోంది. బీజేపీ రాజకీయాలకు గోవా, కర్ణాటక రాష్ట్రాలు మనకు సజీవ సాక్ష్యం. ఇప్పుడు మహారాష్ట్రలో సీఎం సీటు పంచుకుంటే.. మొదట బీజేపీ సీటుపై కూర్చుంటే.. జరిగేదేమిటో..  శివసేన బాగానే అంఛనా వేయగలిగింది. సీటుపై కూర్చోగానే.. ముందుగా శివసేననే నిట్ట నిలువునా చీల్చివేయగల సామర్థ్యం బీజేపీకి ఉంది. అందుకే రాతపూర్వక ఒప్పందం కావాలని శివసేన కోరుతోంది. సీటు పంచుకోవడమే బీజేపీకి ఇష్టం లేదు. అందుకే వేచి చూస్తోంది. అవసరమైన సంఖ్య ఇండిపెండెంట్​ లేదా.. ఇతర పార్టీల నుంచి ఏమైన సమకూరుతుందా..? అన్న వేటలో ఉంది. సో దీపావళి వెళ్లిపోయింది. ఇప్పుడు మహాలో సీటు పంచుకుంటారా..? మిత్రుత్వం తుంచుకుంటారా..? వేచి చూడాలి. ఇందులో ఏది జరిగినా.. స్పెషలే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here