ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నానని కలలు కన్న శివసేన అధిపతి ఉద్దవ్ థాక్రే.. ఆశలు అడియాశలయ్యాయి. కుర్చీ కోసం చిరకాల సైద్ధాంతిక మిత్రుడు.. బీజేపీని వదిలి పెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ రాత్రికి రాత్రే జరిగిన పరిణామాలతో బొక్క బోర్లా పడ్డారు. తెరముందు జరుగుతున్న పరిణామాలతోనే గడిపిన ఉద్దవ్ థాక్రేకు.. తెరవెనుక జరుగుతున్న పరిణామాలను పట్టించుకునే తీరిక లేకుండా పోయినట్టుంది. రెండ్రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్రమోదీని.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలిశారు. ఆరోజే మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీని వెనుక మరాఠా రాజకీయాలున్నాయని. అయితే శరద్ పవార్ కూడా కొట్టి వేశారు. అలాంటిదేమీ లేదని. దీనికి బలం చేకూర్చడానికే.. కాంగ్రెస్ చీఫ్ సోనియాను కూడా పవార్ కలిశారు. ముగ్గురం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ప్రపోజ్ చేశారు కూడా. ఆమె కూడా నమ్మారు. శివసేన కూడా నమ్మింది. కాదు కాదు నమ్మించారు. చివరకు ఆ రెండు పార్టీలను నట్టేట ముంచేశారు రాజకీయ కురువృద్ధుడు పవార్.
ఆయన ఎందుకు బీజేపీతో జత కట్టారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్ధమవుతోంది. ఆయనపై ఉన్న ఆర్ధికపరమైనే కేసులు. విచారణ. ఇవొక్కటే ప్రదానమని కూడా కాదు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించినా.. ఎన్సీపీకి దక్కేది ఉప ముఖ్యమంత్రి పదవే. బీజేపీకి మద్దతిచ్చినా.. దక్కేదీ అదే ఉప ముఖ్యమంత్రి పదవే. శివసేనతో కలిస్తే.. కేసుల విచారణ కొనసాగుతూ ఉంటుంది. బీజేపీతో కలిస్తే.. కొంత వెసులుబాటు. అందుకే శివసేన, కాంగ్రెస్ మరియు బీజేపీ వీటిలో ఎవరితో కలిస్తే లాభమన్నది పవార్ గ్రహించగలిగారు. అందుకే.. సంకోచం లేకుండా.. కాంగ్రెస్ ఫ్రెండ్ షిప్‌ను.. ఫ్రెండ్ షిప్ చేస్తానన్న శివసేనను పక్కకు పెట్టేశారు. బీజేపీతో జత కట్టారు. అయితే దీనికి ఎన్సీపీలో చీలిక అన్న పేరు పెట్టారు. ఎందుకంటే పవార్‌కు మచ్చ అంటకుండా. మొత్తానికి శివసేన సీఎం కలలు కల్లలయ్యాయి. సోనియా అమాయకత్వమా..? అతి నమ్మకమా..? తెలీదు కానీ మోదీషా రాజకీయాల ముందు ఓడిపోయారు.