Home breaking news మహారాష్ట్రలో బీజేపీ వ్యూహమిదే.. శివసేన కథ కంచికే

మహారాష్ట్రలో బీజేపీ వ్యూహమిదే.. శివసేన కథ కంచికే

119
0

రాజకీయాల్లో మారిన బీజేపీని చూసుకుంటూ వస్తుంటే.. ఆ పార్టీకి గతంలో ఉన్న ద డిఫరెన్స్​ అనే ట్యాగ్​ తొలిగిపోయింది. ఈ అంశంపై ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఈ మధ్య కర్ణాటక, గోవాలో చోటు చేసుకున్న పరిణామాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరుగుతుందనే అంశం ఇప్పుడు చర్చ. సీఎం పదవి చెరి సగం పంచుకుందామని చెప్పిన బీజేపీ (నిజంగానేనా.. లేక శివసేన అలా చెప్పిందా.?) మాట మీద నిలబడుతుందా.? పరిణామాలు చూస్తుంటే అధికారం చెరి సగం పంచుకోవడమనేదీ కన్పించడం లేదు. బీజేపీ ఒంటరిగానే గవర్నర్​ను కలిసింది.

సీఎం దేవేంద్ర ఫడ్నవిస్​ శివసేనకు గట్టిగానే కౌంటర్​ ఇచ్చారు. నేనే సీఎం అని చెప్పేశారు. ప్రతిభ ఉంటేనే.. పదవులు వస్తాయని స్పష్టం చేశారు. అంటే వారసులు కాదన్నట్టేగా. తీర్పు బీజేపీ అనుకూలంగా ప్రజలు ఇచ్చారు. ఆ ప్రకారమే.. ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా ప్రకటించారు. సీఎం పదవి పంచుకోవమన్న ప్రశ్నే లేదన్నారు. ఇవన్నీ చూస్తుంటే.. బీజేపీ సొంతంగానే సర్కారు ఏర్పాటు చేస్తుందని నమ్మవచ్చు. ఇండిపెండెంట్ల మద్దతు పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కీలకమైన మహారాష్ట్రలో.. శివసేన అవసరం లేకుండానే.. సొంతంగా ఎదిగేందుకు బీజేపీకి అన్ని అవకాశాలున్నాయి. ఈ సమయంలో సీఎం పదవిని పంచుకోవడానికి శివసేనకు బీజేపీ ఏ మాత్రం అవకాశమివ్వదు. అవసరమైతే. కాంగ్రెస్​ లేదా ఎన్సీపీని నిట్ట నిలువున్నా చీల్చి వేస్తుంది. ఇంకా అవసరమతే.. శివసేనను కూడా. మహారాష్ట్రలో జరిగేదీ ఏమిటంటే.. సీఎం సీటుపై బీజేపీ.. శివసేన కథ కంచికి.. అని ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here