Home breaking news మరాఠా పులి శివసేన తోక పట్టుకున్న ఎన్సీపీ, కాంగ్రెస్

మరాఠా పులి శివసేన తోక పట్టుకున్న ఎన్సీపీ, కాంగ్రెస్

128
0

తల్లి కాంగ్రెస్​, పిల్ల కాంగ్రెస్ రెండూ కలిసి మరాఠా పులి శివసేన తోక పట్టుకుంటున్నాయి. సారీ పట్టుకున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి మహారాష్ట్రలో సర్కారును ఏర్పాటు చేస్తామని ప్రకటించేశాయి. బాగానే ఉంది.. భావజాల సారుప్యమున్న బీజేపీతో అంటకాగినప్పుడే  ఆ పార్టీనీ ఉతికి ఆరేసిన శివసేన.. ఇప్పుడు తమతో అంటకాగే తల్లిపిల్ల కాంగ్రెస్​ను ఏ మేరకు భరిస్తుందో భరతం పడుతుందో చూడాలి. ఇక పోతే.. పిల్ల కాంగ్రెస్​ అధినేత శరద్​పవార్​ చేసిన ప్రకటనలను వివరంగా చదువుదాం.  

అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడబోయే తమ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం కొనసాగుతుందని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ప్రకంచేశారు.  విభిన్న సైద్ధాంతిక భావాలున్న తమ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శివసేన నేతృత్వంలో ఏర్పాటుకానుందని గంభీరంగా వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ప్రాథామ్యాలపై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)పై మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని చెప్పేశారు.  అభివృద్ధే లక్ష్యంగా మా సర్కారు సుస్థిర పాలన అందిస్తుంది. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదని కుండబద్దలు కొట్టేశారు. సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటూ మాజీ సీఎం ఫడ్నవీస్‌ చెప్పడంపై  స్పందిస్తూ.. ఫడ్నవీస్​ జోతిష్యం నేర్చుకున్న సంగతి నాకు తెలియదు సుమా అంటూ వెటకారమాడారు. మా సంకీర్ణం లౌకిక భావాల ప్రాతిపదికన పనిచేస్తుందందూ చెప్పుకొచ్చారు. బాగానే ఉంది బీజేపీ కంటే కరుడు కట్టిన హిందుత్వం శివసేనది.. ఈ లౌకికం.. అలౌకికం అంటూ ఆ పార్టీకి ఉండదు. సీఎం సీటుపై కూ ర్చున్నామని ఏమన్నా.. వెనుక ముందాడుతారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here