Home ఎడ్యుకేషనల్/జాబ్స్ మనిషిగా ఆలోచించండి- కేసీఆర్, కేటీఆర్ కు పొన్నాల సూచన

మనిషిగా ఆలోచించండి- కేసీఆర్, కేటీఆర్ కు పొన్నాల సూచన

151
0

హైదరాబాద్: విద్యార్థుల పట్ల కాస్తా మనుష్యులు గా ఆలోచించండని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు. కేసీఆర్ సర్కార్ వైపల్యాలకు ఇంటర్ విద్యార్థులు బలౌతున్నారన్నారు. కేసీఆర్ .. కేటీఆర్ కలలు కంటూ ఆకాశంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులు ఆత్మహత్య పాల్పడుతున్న.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లోనే కూర్చున్నారని విమర్శించారు. మీ ఇంట్లో వాళ్లు అలా చేసుకుంటే కేసీఆర్ చోద్యం చూస్తూ కూర్చుంటారా..? అని ప్రశ్నించారు. మృగాలుగా కాకుండా .. మనుషులుగా ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ సర్కార్ నినాదాల సర్కార్ గాని.. విధానాల సర్కార్ కాదన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ ..ఆయన కుటుంబ సభ్యుల అండతో డ్రగ్ మాఫియా .. పబ్ మాఫియా .. శాండ్ మాఫియా రెచ్చిపోతున్నాయన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్య ముసుగులో నియంత పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ తప్పులను చూపి బ్లాక్ మెయిల్ చెయ్యడానికే మోదీ ఐటీ నోటీసులు పంపించారని తెలిపారు. తప్పులు చేశాడు కాబట్టే మోడీ వద్ద కేసీఆర్ మొకరిల్లుతున్నాడని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here