Home breaking news మంత్రి ఎర్రబెల్లి ఏం చెప్పారబ్బ.. కేసీఆర్ ఓనరైతే.. మిగిలినోళ్లంత.!

మంత్రి ఎర్రబెల్లి ఏం చెప్పారబ్బ.. కేసీఆర్ ఓనరైతే.. మిగిలినోళ్లంత.!

326
0
ముచ్చటించుకుంటున్న మంత్రులు ఎర్రబెల్లి, ఈటల

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిజమే చెప్పారబ్బ. అందరూ లోలోపల అనుకునేదే ఈయన బయట చెప్పారు. అయితే ఇది బయట చెప్పడం వల్ల వచ్చే లాభమేంటో కానీ.. జనాలకు మాత్రం నిజమైతే తెలిసిపోయింది. మొన్న మంత్రి ఈటల రాజేందర్​ తన కడుపులో ఉన్నదంత కక్కేసిన ముచ్చట అందరికి తెలిసిందే. గులాబీకి మేమే ఓనర్లమంటూ ఇంకా చానా చెప్పేశాడు. అంతా అందరూ విన్నదే చదివిందే కాబట్టి మళ్లా రాయడమెందుకు.

రాక రాక చాన్రోజులకు మంచి గొడ్డు కారం దట్టించిన చికెన్..​ మటన్​ లెక్క ఈటల మాట్లాడిన మాటలు విలేకరులకు కూడా హుషారెక్కించినట్టున్నాయి. ఇంకేముంది నిన్న కన్పించిన మంత్రి ఎర్రబెల్లిని అడగనే అడిగిరి.. గులాబికి ఓనర్లంతమెంది అని.. మొన్నటి ఈటల మాటలను ఒక్క మాటలో తెగ్గొట్టిండు ఎర్రబెల్లి.. ఇండ్ల అనుమానమేముంది.. టీఆర్​ఎస్​ ఓనర్​ కేసీఆర్​ ఒక్కరే. జెండా తయారు చేసింది కూడా కేసీఆరేగా అని కుండ బద్దలు కొట్టేశాడు. ఈటల మాటలు ముగిసిన అంశమని తనదైన లెక్కలే చెప్పిన ఎర్రబెల్లి.. ఈయన పదవికి మాత్రం ఢోకా లేదని చెప్పేశాడు. మొత్తానికైతే అందరూ లోపలనుకొని కుమిలిపోతున్న ముచ్చటను.. ఎక్కడ జారకుండా ‘టీఆర్​ఎస్​ ఒనరే కేసీఆర్​’ అని ఎర్రబెల్లి చెప్పిన మాటలను విన్నోళ్లంత మరి మిగిలినోళ్లంత అని అనుకుంటున్నారు.

టీఆర్​ఎస్​ పార్టీ తెలంగాణ ప్రజలదే అని కేసీఆర్​ చెప్పిన ముచ్చట మాటేందని కూడా అనుకుంటున్నారు. ఏదేమైతేందీ..? ఉన్న ముచ్చటను సూటిగా సుత్తి లేకుండా ఎర్రబెల్లి చెప్పేసిండు. అందుకే ఎర్రబెల్లి ఏం చెప్పాడబ్బ అని ముందుగా అన్నది ఇందుకే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here